ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో భారత రెజ్లర్ బజరంగ్ పూనియాకి రజత పతకం .

    0
    10

    హంగేరి రాజధాని బుడాపెస్ట్ లో అక్టోబర్ 22న జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగం ఫైనల్ లో 24 ఏళ్ల బజరంగ్ (హరియాణా) 9-16 పాయింట్ల తేడాతో టకుటో ఒటోగురో(జపాన్) చేతిలో ఓడి రజతం దక్కించుకున్నాడు.

    దీంతో ప్రపంచ సీనియర్ చాంపియన్ షిప్  చరిత్రలో రెండు పతకాలు గెలిచిన తొలి భారత రెజ్లర్ గా  గుర్తింపు పొందాడు. 2013లో బుడాపెస్ట్ వేదికగా జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ లో  బజరంగ్ 60 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. ఇప్పటివరకు భారత్ తరఫున సుశీల్ కుమార్ (66 కేజీలు; 2010లో) ఒక్కడే ప్రపంచ చాంపియన్ షిప్  లో  స్వర్ణం సాధించాడు.