ప్రపంచ వినియోగదారు హక్కుల రక్షణ దినం

  0
  7

  భారతదేశం 1989 నుంచి మార్చి నెల 15వ తేదీ నాడు ప్రపంచ వినియోగదారుల రక్షణ దినాన్ని పాటిస్తూ వస్తోంది.

   ఈ రోజుకు చారిత్రక ప్రాముఖ్యం కూడా ఉంది. 1962 మార్చి 15వ తేదీ నాడు అమెరికా దిగువ సభలో వినియోగదారు హక్కుల బిల్లును ప్రతిపాదించడం జరిగింది.

  ఆ సందర్భంగా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ ప్రసంగిస్తూ ‘‘వినియోగదారుకు నాసిరకం ఉత్పత్తులను ఇచ్చినట్లయితే, ధరలు మరీ ప్రియంగా ఉంటే, ఔషధాలు సురక్షితంగా లేకపోతే లేదా గుణహీనంగా ఉంటే, వినియోగదారు పూర్తి సమాచారం తెలుసుకోకుండా ఏదైనా వస్తువును కొనుగోలుకు ఎంపిక చేసుకొంటే- అటువంటప్పుడు డాలర్ తన విలువను కోల్పోయినట్లవుతుంది. వినియోగదారు ఆరోగ్యానికి, భద్రతకు ముప్పు ఏర్పడవచ్చు; దేశ ప్రయోజనం దెబ్బతింటుంది కూడా’’ అన్నారు.

  ఆ రోజున యుఎస్ కాంగ్రెస్ లో కెన్నెడీ చేసిన ప్రసంగం యొక్క ప్రాముఖ్యాన్ని, తత్ఫలితంగా రూపొందిన శాసనాన్ని పరిగణనలోకి తీసుకొన్న కన్జ్యూమర్స్ ఇంటర్ నేషనల్ (సిఐ) 1983 నుంచి ప్రతి సంవత్సరం మార్చి నెలలో 15వ తేదీని ‘ప్రపంచ వినియోగదారు హక్కుల రక్షణ దినం’గా పాటించాలంటూ 1982లో ఒక నిర్ణయం తీసుకుంది.

  2019కి గాను ప్రపంచ వినియోగదారు హక్కుల రక్షణ దినం యొక్క థీమ్ – నమ్మదగిన స్మార్ట్ వస్తువులు.