ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత్ 68వ స్థానం

  0
  6

  58వ వార్షిక పోటీ సామర్థ్య సూచీలో భారత్‌ 10 స్థానాలు దిగజారి 68వ స్థానంలో నిలిచింది.

  ప్రపంచంలోనే అత్యంత పోటీ సామర్థ్యం గల దేశంగా సింగపూర్‌ నిలిచింది. అమెరికా స్థానంలో సింగపూర్‌ వచ్చింది .అమెరికా రెండవ స్థానంలో నిలిచింది. ప్రపంచ పోటీతత్వ సూచీ విడుదల చేసినది — వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యుఈఫ్‌)

  ఈ సూచీలో భారత్‌ 10 స్థానాలు దిగజారడంతో బ్రిక్స్‌ దేశాల్లో అత్యంత నిరాశావహమైన పనితీరు కనబరుస్తున్న దేశాల్లో ఒకటిగా భారత్‌ మారింది.

  భారత్ అగ్రస్థానం –స్థూల ఆర్థిక స్థిరత్వం, మార్కెట్‌ విస్తృతి లో అగ్రస్థానంలో ఉంది .
  15 వ స్థానం –కార్పొరేట్‌ గవర్నెన్స్‌
  2 వ స్థానం –షేర్‌హోల్డర్‌ గవర్నెన్స్‌
  3 వ స్థానం మార్కెట్‌ సైజు, రెన్యూవబుల్‌ ఎనర్జీ ఇన్నోవేషన్‌లో ముందు వరుసలో ఉంది.

  వెనకబాటు – ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ)వినియోగం, ఆరోగ్యవంతంగా జీవించే కాలపరిమితి అంశాల్లో భారత్ వెనుకబడి ఉంది. ఆరోగ్యవంతమైన జీవితకాలపరిమితి విషయంలో భారత్‌ 141 దేశాల్లో 109వ స్థానంలో ఉంది.

  103 అంశాల ఆధారంగా గ్లోబల్‌ కాంపిటీటివ్‌ ఇండెక్స్‌లో స్థానాలను డబ్ల్యూఈఎఫ్‌ ఏటా నిర్ణయిస్తుంటుంది. మొత్తం 141 దేశాలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకుంటుంది.

  ఈ సూచీలో భారత్ వెనుకబాటుకు కారణాలు– ఉత్పత్తుల మార్కెట్‌ సామర్థ్యం తక్కువగా ఉండడం, వాణిజ్య విధానాల్లో దాపరికంలేని వైఖరి లోపించడం, కార్మికుల హక్కుల పరిరక్షణ లోపించడం, మహిళా కార్మిక భాగస్వామ్యం అతి తక్కువగా ఉండడం.