ప్రపంచ ఆరోగ్య దినం : ఏప్రిల్‌ 7

  0
  20

  ‘అందరికీ ఆరోగ్యం’ అనే నినాదంతో ఈ ఏడాది( ఏప్రిల్‌ 7) ‘ప్రపంచ ఆరోగ్య దినం.

  అందరికీ ఆరోగ్యాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సునిశితంగా నిర్వచించింది. ఏ కారణంతోనైనా అనారోగ్యానికి గురైనప్పుడు ఏ ఒక్కరు కూడా పేదరికమనే కారణంతో చికిత్సకు దూరం కాకూడదు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది

  దీన్ని మూడు రకాలుగా పేర్కొంది.

  ఎంతమంది జనాభాకు వైద్యసేవలు అందుతున్నాయి
  2. ఎన్నిరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి
  3. ఎంత వ్యయం పెడుతున్నారు.. ఈ కోణాల్లో 100 శాతం అందించగలగాలి.
  అంటే జనాభాకు 100 శాతం రకాల జబ్బులకూ మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరించడం. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.

  ఇటీవల జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే-4 ముఖ్యాంశాలు:

  ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం పొందినా అదనంగా జేబుల్లోంచి సుమారు రూ.4 వేలు ఖర్చు అవుతుంది
  అధిక రక్తపోటు, మధుమేహం వంటి వాటికి నెలనెలా మందులు వాడలేని దుస్థితుల్లో గ్రామీణులు గుండెపోటు, పక్షవాతం వంటి జబ్బులతో ఉన్నత వైద్యానికి ప్రైవేట్ వైపు వెళ్లాల్సి వస్తోంది.
  కలుషిత నీటిని తాగడం వల్ల, పరిసరాల అపరిశుభ్రం వల్ల కలిగే వ్యాధుల భారం చైనా కంటే భారత్‌లో 40 రెట్లు అధికంగా ఉన్నట్లు నమోదైంది.
  * 2014 గణాంకాల ప్రకారం.. ఔషధాలు కొనలేక, ధరల భారం మోయలేక 3.8 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి జారుతున్నారు.
  * మన పొరుగునున్న శ్రీలంకలో తక్కువ ధరలో ఔషధాలు లభ్యమవుతున్నాయి.
  * మొత్తం ఆరోగ్యానికయ్యే ఖర్చులో రోగి తన జేబుల్లోంచి ఖర్చు పెట్టుకుంటున్న దేశాల జాబితాలో మొత్తం 191 దేశాలకు గాను భారత్‌ 182వ స్థానంలో ఉంది.

  ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం:

  రాష్ట్రంలో దాదాపు 98 లక్షల కుటుంబాలు (అంటే దాదాపు 98శాతం) ఏదో ఒక ప్రభుత్వ ప్రయోజన పథకం ద్వారా వైద్యసేవలు పొందుతున్నాయి
  ఏటా ఈ పథకాల కింద దాదాపు రూ.1700 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తోంది.
  ఈ నిధుల్లో 90 శాతానికి పైగా ఉన్నత స్థాయి వైద్యానికే ఖర్చవుతోంది.
  అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన రెండో సూచనలో ‘ఎన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? వాటి కోసం ఎంత వ్యయం చేస్తున్నారు?’ అనే విషయాల్లో మాత్రం ఇంకా లక్ష్యాన్ని చేరాల్సి ఉందనేది నిపుణుల అభిప్రాయం.

  లక్ష్యాలు:

  ప్రాథమిక వైద్యానికి మానవ వనరులను గణనీయంగా పెంచాలి.
  రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వైద్య బడ్జెట్‌ను రెట్టింపు చేయాలి.
  ప్రభుత్వం వేర్వేరు రూపాల్లో అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకాలను ఒక్క తాటిపైకి తేవాలి.
  2020 వరకూ రోగి సొంత ఖర్చును కనీసం 50 శాతానికి తగ్గించాలి.
  తప్పనిసరి, అత్యవసర ఔషధాలను, నిర్ధారణ పరీక్షలను ఉచితంగా అందించాలి. ప్రజారోగ్య పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి.