ప్రపంచ అటవీ దినోత్సవం

  0
  7

  ప్రపంచ అటవీ దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 21 న నిర్వహించబడుతుంది.

   2012, నవంబరు 28న యునెస్కో వారిచే తీర్మానించబడిన ప్రపంచ అటవీ దినోత్సవం, 2013 మార్చి 21న తొలిసారిగా నిర్వహించబడింది. ప్రస్తుత మరియు ముందు తరాల వారికి అడవుల ప్రాముఖ్యత, ప్రయోజనాలను తెలియజేయడంకోసం ఈ దినోత్సవం రోజున వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు.

  2013: మొదటి ప్రపంచ అటవీ దినోత్సవం రోజున ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థల ఆధ్వర్యంలో చెట్లు నాటడం, చెట్ల పెంపకంపై అవగాహన కార్యక్రమాలు జరిపి, ఆయా కార్యక్రమాల ఫోటోలు వీడియోలను సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం చేశారు.
  2014: “మై ఫారెస్ట్ | అవర్ ఫ్యూచర్” అనే పేరుతో ప్రచారంచేసి, ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా అటవీ ప్రాంతాలతో సంబంధం ఏర్పరుచుకోవాలన్న అంశంపై దృష్టి పెట్టడం జరిగింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో “అడవుల స్థిరమైన అభివృద్ధి మార్పుకి మహిళల పాత్ర” అనే ప్రత్యేక కార్యక్రమం జరిగింది.
  2015: “అడవులు | వాతావరణం | మార్పు” అనే నేపథ్యంతో ప్రచారం చేయబడింది.
  2017: “అడవులు మరియు శక్తి” అనే నేపథ్యంను తీసుకోబడింది. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 19 ప్రధాన కార్యక్రమాలు జరిగినట్టు ఆహార మరియు వ్యవసాయ సంస్థ అధికారిక వెబ్సైట్ లో పెట్టబడింది.
  2018: “ఫారెస్ట్ అండ్ సస్టైనబుల్ సిటీస్” అనే నేపథ్యంతో ప్రచారం చేయబడింది.

  2019: ఫారెస్ట్స్ అండ్ ఎడ్యుకేషన్: లెర్న్ టు లవ్ ఫారెస్ట్స్  అనే థీమ్