ప్రపంచవ్యాప్తంగా అత్యంత రద్దీ విమానాశ్రయాలకు ర్యాంకులు

  0
  14

  ప్రయాణికుల రద్దీలో దిల్లీ విమానాశ్రయానికి 12వ స్థానం లో నిలిచింది.

  ప్రపంచంలో అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో జీఎంఆర్‌ నేతృత్వంలోని దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ) 12 స్థానం లభించింది. 2017తో పోలిస్తే 4 స్థానాలను మెరుగుపర్చుకోవడం గమనార్హం. ఆ ఏడాది 16వ ర్యాంకును పొందింది.

  2018 సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా అత్యంత రద్దీ విమానాశ్రయాలకు ఎయిర్‌పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ (ఏసీఐ) ర్యాంకులు ఇచ్చింది. ఈ ర్యాంకుల ప్రకారం ఫ్రాంక్‌ఫర్ట్‌, డల్లాస్‌ ఫోర్త్‌ వర్త్‌, ఇస్తాన్‌బుల్‌ అటాతుర్క్‌ విమానాశ్రయాలను దిల్లీ విమానాశ్రయం వెనక్కినెట్టడం గమనార్హం.

  46 లక్షల ప్రయాణికుల వ్యత్యాసంతో అమెస్టర్‌డామ్‌, పారిస్‌, షాంఘై, హాంకాంగ్‌ విమానాశ్రయాల వెనక నిలిచింది. ప్రయాణికుల సంఖ్య పరంగా భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద విమానయాన విపణిగా అవతరించిందని ఏసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఏసీఐ నివేదిక ప్రకారం ప్రయాణికుల రద్దీలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతోన్న విమానాశ్రయాల్లో కూడా ఇందిరాగాంధీ విమానాశ్రయం నిలిచింది. 2018లో దేశీయ, విదేశీ ప్రయాణికుల సంఖ్యలో 6.9 శాతం వృద్ధి నమోదైంది.