ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన ప్రారంభము

    0
    16

    కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌లో పేర్కొన్న పథకం ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన.

    దీన్ని ప్రధాని మోదీ 05 మార్చ్ 2019న అహ్మదాబాద్‌లో ప్రారంభించారు. నెలసరి ఆదాయం రూ.15 వేలు పొందుతున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అసంఘటిత కార్మికులు అంటే ఇళ్లలో పని చేసే వారు కావచ్చు, కూలీ పనులు చేసే వారు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు, రోజు వారీ వేతనం తీసుకునే వారు వీరందరికి ఈ పథకం క్రిందకు వస్తారు.

    # కార్మిక మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 40 సంవత్సరాల లోపు వయసు ఉన్న కార్మికులు మాత్రమే ఈ పథకానికి రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు వుంటుంది. వీరికి 60 ఏళ్లు పూర్తి అయిన తరువాత నెలకు 3 వేల రూపాయల పింఛను అందుతుంది.

    # 18 ఏళ్ల వయసు పైబడిన వారు ఈ పథకానికి వర్తించరు. వీరు నెలకి రూ.55లు ప్రీమియం కట్టాలి.

    # 29 ఏళ్ల వయసు పైబడిన వారు రూ.100 లు కట్టాలి. 40 ఏళ్ల పైబడిన వారు నెలకు రూ.200లు కట్టాలి.  అయితే ఈ పథకంలో చేరాలంటే కచ్చితంగా 18 సంవత్సరాలు దాటిన వారు మాత్రమే స్కీంలో జాయిన్ అవ్వాలి. మీరు డిపాజిట్ చేసిన మొత్తం డబ్బును ప్రభుత్వం మీ పేరుతోనే జమ చేస్తుంది.

    # ఈ పథకంలో చేరాలనుకునే ఏ వ్యక్తి అయినా ఆధార్ కార్డు, బ్యాంకులో ఖాతా తెరిచి ఉండాలి. ఇంకా ఈ పథకానికి సంబంధించిన మరింత సమాచారం కావాలంటే 1800 2676 888 టోల్ ఫ్రీకి కాల్ చేసి తెలుసుకోవచ్చు.

    # నేషనల్ పెన్షన్ పథకం, ఉద్యోగుల రాష్ట్ర బీమా కార్పొరేషన్ పథకం లేదా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో ఉన్న వారికి అర్హత లేదు. ఆదాయపు పన్ను ఎవరైతే కడుతుంటారో వారంతా కూడా అనర్హులు అని ప్రకటించింది.

    # ఈ స్కీంలో ఉన్న సభ్యుడు అనివార్య కారణాల వలన మరణిస్తే భాగస్వామి ఈ పథకాన్ని కొనసాగించవచ్చు. ఒకవేళ ఈ పథకం నుంచి ఆమె లేదా అతడు బయటకు రావాలనుకుంటే ఉపసంహరించుకోవచ్చు. జీవిత భాగస్వామి పింఛనులో 50 శాతం పొందుతారు.