ప్రధాని మోదీకి సియోల్ శాంతి పురస్కారం.

    0
    15

    పెద్ద నోట్ల రద్దు భేష్: ప్రశంసించిన అవార్డు కమిటీ
    ప్రధాని నరేంద్రమోదీకి సియోల్ శాంతి పురస్కారం 2018 లభించినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.

    మోదీనామిక్స్‌ ద్వారా దేశం ఆర్థిక వృద్ధికి ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తూ ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు దక్షిణకొరియా వెల్లడించింది. మోదీ అంతర్జాతీయ సహకారం, ప్రపంచ ఆర్థిక పురోగతికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారం అందిస్తున్నారు. ఇరు దేశాలకు అనుకూలమైన సమయం చూసి ఈ పురస్కారాన్ని మోదీకి ఇవ్వనున్నారు.