ప్రధానమంత్రి మోడీ కి గోల్‌కీపర్స్‌ గ్లోబల్‌ గోల్స్‌ అవార్డు

  0
  5

  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్‌కీపర్స్‌ గ్లోబల్‌ గోల్స్‌ అవార్డు పొందారు. ప్రకటించిన సంస్థ- మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌. కారణం- ‘స్వచ్ఛ భారత్‌ మిషన్‌’ ప్రారంభించినందుకు

  మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ చేతుల మీదుగా మోదీ ఈ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత 3 లక్షల మంది ప్రజలను రోగాల బారి నుంచి కాపాడగల్గినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

  స్వచ్ఛ సర్వేక్షన్‌ వల్ల భారతదేశ రాష్ట్రాలు ఇప్పుడు పరిశుభ్రతలో ఉన్నత ర్యాంకు కోసం ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. మహాత్మా గాంధీకి నివాళిగా ప్రధాని మోదీ 2014 అక్టోబర్‌లో స్వచ్ఛ భారత్ మిషన్‌ను ప్రారంభించారు. ఘన మరియు ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ ద్వారా పరిసరాలను శుభ్రంగా ఉంచడం, గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చడం దీని ప్రధాన లక్ష్యం.

  ఈ మిషన్‌ను దేశంలోని 4041 పైగా పట్టణాల్లో అమలు చేస్తారు. మొత్తం ఖర్చు 62,009 కోట్ల రూపాయలలో 14623 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని పట్టణాల్లో పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ అమలు చేస్తుంది. గ్రామాల్లో, కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ అమలు చేస్తుంది.