ప్రజాపతి త్రివేదికి హ్యారీ హ్యాట్రీ పెర్ఫామెన్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాక్టీస్‌ అవార్డు

  0
  8

  ప్రజాపతి త్రివేదికి హ్యారీ హ్యాట్రీ పెర్ఫామెన్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాక్టీస్‌ అవార్డు అమెరికా నుండి లభించినది.

  లండన్‌లోని కామన్వెల్త్‌ సెక్రటేరియట్‌లో సీనియర్‌ డైరెక్టర్‌గా చేస్తున్న ప్రొఫెసర్‌ ప్రజాపతి త్రివేదికి అమెరికాలో ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. పాలనా యంత్రాంగంలో అందించిన విశిష్ట సేవలకు గాను హ్యారీ హ్యాట్రీ పెర్ఫామెన్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాక్టీస్‌ అవార్డు ఆయనను వరించింది.

  సెంటర్‌ ఫర్‌ అకౌంటబిలిటీ అండ్‌ పెర్ఫామెన్స్‌(సీఏపి), అమెరికన్‌ సొసైటీ ఫర్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఏఎ్‌సపీఎ) సంస్థల ప్రతినిధులు వాషింగ్టన్‌లో జరిగిన వేడుకలో ఆయనకు అవార్డును ప్రదానం చేశారు.

  ఆయన 1995-2009 మధ్యకాలంలో ప్రపంచబ్యాంకు ఆర్ధికవేత్తగా, 1992-94 సమయంలో భారతప్రభుత్వానికి ఆర్ధిక సలహాదారుగా, 2009-14 మధ్యకాలంలో భారతప్రభుత్వ కేబినెట్‌ సెక్రటేరియట్‌లో శాశ్వత కార్యదర్శిగా సేవలందించారు.

  ప్రజాపతి త్రివేది

  1953 ఆగస్టులో జన్మించారు.

  ప్రస్తుతము అయన లండన్ లోని కామన్వెల్త్‌ సెక్రటేరియట్‌లో సీనియర్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

  పూర్వము భారత ప్రభుత్వములో కార్యదర్శిగా పని చేసారు.