పుంజుకోనున్న భారత్‌ ఆర్థిక వ్యవస్థ- IMF

    0
    8

    భారత్‌ ఆర్థిక వ్యవస్థ 2019, 2020లో ఊపందుకోనున్నదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) పేర్కొంది.

    ఈ రెండు సంవత్సరాల్లో వరుసగా 7.5 శాతం, 7.7 శాతం వృద్ధి నమోదవుతుందని విశ్లేషించింది.

    ఈ రెండు సంవత్సరాల్లో చైనా ఆర్థిక వృద్ధి రేటు 6.2 శాతంగా ఉంటుందని వివరించింది. తద్వారా భారత్‌ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే

    వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తున్న దేశంగా నిలుస్తుందని ఐఎంఎఫ్‌ పేర్కొంది.

    IMF ప్రధాన కార్యాలయం: వాషింగ్టన్ డిసి, USA

    ఐఎంఎఫ్‌ మొట్టమొదటి మహిళా చీఫ్‌ ఎకనమిస్ట్‌: గీతా గోపీనాథ్‌

    ఈ మేరకు ఐఎంఎఫ్ మొట్టమొదటి మహిళా చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ జనవరి 21న నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2019, 2020ల్లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.5, 3.6 శాతాలుగా ఉంటాయి. ఈ రెండు సంవత్సరాల్లో చైనా ఆర్థిక వృద్ధి రేటు 6.2 శాతంగా ఉంటుంది.