పీవీ నరసింహారావు అవార్డుకు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఎంపిక

  0
  6

  ‘జాతీయ నాయకత్వం, జీవితకాల సాఫల్య పురస్కారం’ పేరిట పీవీ నరసింహారావు అవార్డుకు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఎంపిక చేసినట్లు ‘ఇండియా నెక్స్ట్‌’ సంస్థ ప్రకటించింది.

  దేశ రాజధానిలోని తీన్‌మూర్తి భవన్‌లో మన్మోహన్‌కు పురస్కారాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రదానం చేస్తారని, ప్రత్యేక అతిథిగా ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు శేఖర్‌ గుప్తా హాజరవుతారని పేర్కొంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎన్‌ వెంకటాచలయ్య ఛైర్మన్‌గా, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ్‌ సభ్యుడిగా ఉన్న జ్యూరీ.. మన్మోహన్‌ను పురస్కారానికి ఎంపిక చేసింది.

   

  మన్మోహన్ సింగ్ భారత దేశానికి 17వ ప్రధాన మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యుడైన సింగ్ ప్రధాన మంత్రిగా 2004 మే 22 లో బాధ్యతలు స్వీకరించారు. అనేక అర్హతలు కల సింగ్ 1991లో ఆర్థిక శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణ ల వలన ప్రస్తుత భారత చరిత్రలో ముఖ్యుడిగా భావింపబడుతున్నాడు. మరియు ఇంతటి విద్యా మరియు సేవలలో అనుభవం కలిగిన ప్రధానమంత్రి ప్రపంచంలోనే లేడంటో అతిశయోక్తిగాదు.