“పి.వి. నరసింహారావు- ఛేంజ్‌ విత్‌ కంటిన్యుటీ” పేరుతో డాక్యుమెంటరీ

  0
  6

  ఆయన జీవితం ఆధారంగా ‘పి.వి. నరసింహారావు- ఛేంజ్‌ విత్‌ కంటిన్యుటీ’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందుతోంది. దీని ట్రైలర్‌ను విడుదల చేశారు.

  భారత దేశపు తొమ్మిదో ప్రధానిగా పనిచేసిన వ్యక్తి పి.వి. నరసింహారావు. 1957లో శాసన సభ్యుడిగా రాజకీయ జీవితం ఆరంభించిన ఆయన మంత్రిగా, ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు.

  ఇందులో నరసింహారావుతో కలిసి పనిచేసిన మంత్రులు, ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు, పలువురు జర్నలిస్టులు చెప్పిన సమాచారాన్ని చూపించారు. నరసింహారావు గొప్ప నాయకుడని, ప్రజల కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారని వారు వివరించారు.

  1991లో ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయని వర్ణించారు. జూన్‌లో ఈ పూర్తి డాక్యుమెంటరీని విడుదల చేయబోతున్నారు.

  పీవీ నర్సింహారావు స్మారకార్థం హైదరాబాదులో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లై ఓవర్ కు పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే అని పేరుపెట్టారు.

  పూర్తి పేరు: పాములపర్తి వెంకటనర్సింహారావు

  1938 వందేమాతర ఉద్యమం(హైదరాబాద్ రాష్ట్రంలో) లో పాల్గొన్నాడు

  రాజకీయం:

  4వ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి(1971-09-30 – 1973-01-10)
  10వ భారత ప్రధానమంత్రి(21 June 1991 – 16 May 1995)
  తెలంగాణా సాయుధ పోరాట నేపథ్యంలో “గొల్ల రామవ్వ” కథ విజయ కలంపేరుతో కాకతీయ పత్రికలో 1949లో ప్రచురితమైంది
  సహస్రఫణ్: విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన వేయిపడగలు కు హిందీ అనువాదం
  ఆత్మకథ నవల: ది ఇన్‌సైడర్