పి.టి. ఉషకు ఐఏఏఎఫ్ వెటరన్ పిన్ అవార్డు

  0
  13

  భారత మాజీ అథ్లెట్, దిగ్గజ ఒలింపియన్ పి.టి. ఉషను అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) ప్రతిష్టాత్మక ‘వెటరన్ పిన్’ అవార్డుకు ఎంపిక చేసింది.

  ఖతర్ రాజధాని దోహాలో సెప్టెంబర్ 24న జరగనున్న ఐఏఏఎఫ్ కాంగ్రెస్‌లో 55 ఏళ్ల ఉషకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో సుదీర్ఘ కాలం పాటు చేసే సేవలకు గుర్తింపుగా ఐఏఏఎఫ్ వెటరన్ పిన్ అవార్డును అందజేస్తున్నారు.

   పి.టి. ఉష

  పూర్తి పేరు పిలావుళ్ళకండి తెక్కేపఱంబిల్ ఉష.

  భారత దేశపు పరుగుల రాణిగా పేరుగాంచిన పి.టి.ఉష కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా పయోలీలో 1964 june 27న జన్మించింది.

  1979 నుంచి, భారతదేశం తరఫున అథ్లెటిక్స్ లో పాల్గొని, దేశానికి పలు విజయాలను అందించింది. ఈమె ముద్దు పేరు పయోలి ఎక్స్‌ప్రెస్. 1986 సియోల్ ఆసియా క్రీడలలో 4 బంగారు పతకాలు. ఒక రజిత పతకం సాధించింది.

  1982 ఢిల్లీ ఆసియా క్రీడలలో కూడా 2 రజిత, 1990 ఆసియాడ్ లో 3 రజిత, 1994 ఆసియాడ్ లో ఒక రజిత పతకాలు సాధించింది. 1984 లాస్‌ ఏంజిల్స్ ఒలింపిక్స్లో 400 మీటర్ల హార్డిల్స్ పరుగు పందెంలో సెకనులో వందోవంతులో కాంస్య పతకం లభించే అవకాశం కోల్పోయిననూ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో ఫైనల్స్ చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది.

  ఆమె దేశానికి సాధించిపెట్టిన ఖ్యాతికి గుర్తుగా భారత ప్రభుత్వం 1985లో పద్మశ్రీ మరియు అర్జున అవార్డు లతో సత్కరించింది. అంతర్జాతీయ క్రీడాజీవితంలో మొత్తం మీద ఈమె 101 స్వర్ణ పతకాలను సాధించింది.