పవర్ బోట్ ప్రపంచ చాంపియన్షిప్ ప్రారంభం

  0
  9

  5వ పవర్ బోట్ ప్రపంచ చాంపియన్షిప్ పోటీలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవంబర్ 16న ప్రారంభించారు.
  విజయవాడ వద్ద కృష్ణానదిలో భవానీఘాట్ వద్ద ఈ బోట్ రేసును నిర్వహిస్తున్నారు.

  బోట్ రేసు నిర్వహించే ప్రాంతాన్ని ఎన్టీఆర్ సాగర్ అమరావతిగా నామకరణం చేశారు. ప్రపంచంలో ఎఫ్1హెచ్2వో రేసులు ఏడు చోట్ల నిర్వహిస్తుండగా అమరావతిలో నిర్వహించేది 5వ రేసు. ఆరో రేసును దుబాయి, ఏడవ రేసును షార్జాలో నిర్వహించనున్నారు.

  బోట్ రేసు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… అమరావతిలో తప్ప ఇతర దేశాల్లో ఉప్పునీటిలో ఇలాంటి పోటీలు నిర్వహిస్తారన్నారు. ప్రకాశం బ్యారేజికి ఎగువున వైకుంఠపురం దిగువున చోడవరం బ్యారేజీలు వస్తున్నాయని, ఆయా ప్రాంతాల్లో 70 నుంచి 80 కిలోమీటర్ల పొడవున వాటర్ ఫ్రంట్ ఏర్పడనుందన్నారు. కృష్ణా నదిలో 9 ఐలాండ్లు ఉన్నాయని ఆయా ప్రాంతాల్లో ఐకానిక్ బ్రిడ్జిలు రాబోతున్నాయని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో 32 చారిత్రక వారసత్వ కట్టడాలపై పర్యాటక శాఖ రూపొందించిన వీడియోను సీఎం ఆవిష్కరించారు.
  రాజధాని అమరావతిలో ఇక ఏటా బోట్‌ రేసింగ్‌ పోటీలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. విజయవాడ వద్ద కృష్ణా నదిలో శుక్రవారం ఆయన పవర్‌ బోట్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీలు ప్రారంభించారు. తర్వాత ఆయన సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్లతో కలిసి బోట్‌లో విహరించారు. బోట్‌ రేసు నిర్వహించే ప్రాంతాన్ని ఎన్టీఆర్‌ సాగర్‌ అమరావతిగా నామకరణం చేశారు.

  హైదరాబాద్‌లో ఫార్ములా–1 కార్ల రేసును తీసుకురావడానికి ప్రయత్నించానని అయితే అమరావతికి అంతకన్నా మెరుగైన విధంగా నిర్వహించేందుకు ఎఫ్‌1హెచ్‌2వో రేసులను తీసుకురాగలిగానని చెప్పారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు వచ్చే నాలుగేళ్లలో లక్ష రూములు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా పని చేయాలని అధికారులకు సూచించారు.