నేడు జీఎస్ఎల్వీ-మార్క్3డీ2 రిహార్సల్

    0
    15

    భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జియోసింక్రనస్ ఉపగ్రహ ప్రయోగ వాహక నౌక (జీఎస్ఎల్వీ)-మార్క్3డీ2 ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది.

    శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఈ నెల 14న ఈ రాకెట్ ని ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే. ప్రయోగానికి ముందు నిర్వహించే రిహార్సల్ కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టనున్నారు. సోమవారం రాకెట్ సన్నద్ధత సమావేశం (ఎంఆర్ఆర్), లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) సమీక్ష జరగనుంది. మంగళవారం మధ్యాహ్నం 3.38 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం అవుతుంది. ఈ వాహక నౌక 3,600 కిలోల బరువైన జీశాట్-29 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి మోసుకెళుతుంది. ప్రధానమంత్రి డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా జీశాట్-29 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాలకు (విలేజ్ రిసోర్స్ సెంటర్లకు) హైస్పీడ్ అంతర్జాల సేవలను చేరువ చేయాలనేది లక్ష్యం.