నూతన నౌకాదళాధిపతిగా కరమ్‌బీర్‌ సింగ్‌

  0
  7

  భారత నౌకాదళ తదుపరి అధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ కరమ్‌బీర్‌ సింగ్‌ ఎంపికయ్యారు.

  ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న అడ్మిరల్‌ సునీల్‌ లాంబ మే 30న పదవీ విరమణ పొందనున్నారు. ఆ మరుసటి రోజున కరమ్‌బీర్‌ బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ పేర్కొంది.

  ప్రతిభ ప్రాతిపదికన ఈ నియామకం చేపట్టామని అధికార వర్గాలు తెలిపాయి. ఆ పదవికి అర్హులైనవారిలో అత్యంత సీనియర్‌ను నియమించే సంప్రదాయ విధానాన్ని పాటించలేదని వివరించాయి. వైస్‌ అడ్మిరల్‌ విమల్‌వర్మతో పాటు పలు విభాగాల అధిపతులు కూడా పోటీపడ్డారు. కరమ్‌బీర్‌ సింగ్‌ ప్రస్తుతం విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్నారు.

  కరమ్‌బీర్‌ సింగ్:

  జననం: 3 నవంబర్ 1959

  పంజాబ్ లోని జలంధర్ లో జన్మించారు.

  ముంబై లోని నేవీ కాలేజీ లో విద్యను అభ్యసించారు.

  1980 లో భారత నేవీ లో చేరారు. ఆ తర్వాత 1982 నుండి హెలికాప్టర్ పైలట్ గా అత్యున్నత స్థాయి సేవలను అందించారు.