నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీ 2019

  0
  5

  నీతి ఆయోగ్ జూన్ 25న విడుదల చేసిన ‘ఆరోగ్యవంతమైన రాష్ట్రాలు-అభివృద్ధి భారతం’ అనే సూచీలో కేరళకు అగ్రస్థానం లభించింది.

  కేరళ తర్వాతి స్థానాల్లో వరుసగా ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి. 2015-16 నుంచి 2017-18కాలంలో ఆరోగ్యపరిరక్షణకు ఆయా రాష్ట్రాలు తీసుకున్న చర్యలను పరిగణనలోకి తీసుకుని నీతి ఆయోగ్ ఈ సూచీని రూపొందించింది. మొత్తం 23 అంశాల ఆధారంగా రాష్ట్రాల పనితీరును నీతి ఆయోగ్ అంచనా వేసింది. ఈ సూచీలో ఉత్తర ప్రదేశ్, బిహార్‌లు దిగువ స్థానాల్లో ఉన్నాయి. హరియాణా, రాజస్తాన్, జార్ఖండ్ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ముందున్నాయి. 
   
  ఈ జాబితాలో 3 విభాగాలు రూపొందించింది.
   
  అవి : 1) పెద్ద రాష్ట్రాలు
          2) చిన్న రాష్ట్రాలు
          3) కేంద్రపాలిత ప్రాంతాలు
   
  పెద్ద రాష్ట్రాల కేటగిరీలో కేరళ మొదటి స్థానంలో నిలవగా ఉత్తరప్రదేశ్, బీహారు, ఒడిశా రాష్ట్రాలు చివరి స్థానంలో నిలిచాయి.
  పనితీరుని మెరుగు పర్చుకుంటున్న రాష్ట్రాల్లో హర్యానా, రాజస్థాన్, జార్ఖండ్ ముందు వరుసలో ఉన్నవి.  ఈ నివేదికలో AP 2వ స్థానంలో, తెలంగాణ 10వ స్థానంలో కలదు.  చిన్న రాష్ట్రాల కేటగిరీలో మొదటి స్థానంలో మిజోరాం నిలవగా, సిక్కిం & అరుణాచల్ ప్రదేశ్ లు చివరి స్థానంలో నిలిచాయి. కేంద్ర పాలిత ప్రాంతాల కేటగిరీలో చండి ఘడ్ మొదటి స్థానంలో నిలిచింది.