దేశ వ్యాప్తముగా ఉజ్వల యోజన

  0
  31

  ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ను దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ డిసెంబర్ 17న తెలిపారు.

   గ్రామీణ ప్రాంతాల్లోని దారిద్య్రరేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఉచిత వంటగ్యాస్ కనెక్షన్లను అందించేందుకు ఉజ్వల యోజనను ప్రవేశపెట్టారు.తర్వాతి కాలంలో ఎస్సీ, ఎస్టీలకు, అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి దీనిని విస్తరించారు.

  ప్రధానమంత్రి ఉజ్వల యోజన

  మరోవైపు 50 శాతానికి పైగా(కనీసం 20 వేలు) గిరిజన జనాభా ఉన్న బ్లాకుల్లో ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ పాఠశాలల్ని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రూ.2,242 కోట్లు వెచ్చించనున్నారు.

  నిరుపేదలకు ఉపయోగపడేలా మరో బృహత్తర పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పేదలందరికీ ఉచిత గ్యాస్ పథకాన్ని మే 1న ప్రారంభించింది. దారిధ్యరేఖ(బీపీఎల్)కు దిగువన ఉన్న దేశంలోని 5 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరేలా కేంద్ర ప్రభుత్వం రూ.8 వేల కోట్లతో ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే గీవ్‌ఇట్‌అప్‌లో దేశ వ్యాప్తంగా 1.13 కోట్ల మంది సబ్సిడీ గ్యాస్‌ను వదులుకున్నారు. స్వచ్ఛందంగా వదులుకున్న సబ్సిడీ సొమ్ముతో దేశంలోనే పేదలందరికీ ఉచిత గ్యాస్ కనెక్షన్ల పథకాన్ని రూపొందించి అందించాలని కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంది.

  ఇందులో భాగంగానే మే 1న ఉత్తరప్రదేశ్‌లోని బాలీయా, మే 15న గుజరాత్‌లోని దూద్‌లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. సంపన్నులు గ్యాస్ సబ్సిడీ వదులుకునేందుకు గతేడాది జనవరిలో ప్రధాని మోదీ గీవ్‌ఇట్‌అప్ కార్యక్రమాన్ని ప్రారంభించి సబ్సిడీ పొందుతున్న సంపన్నులు ముందుకు వచ్చి గ్యాస్‌లను వదులుకోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా 1.13 కోట్ల మంది గ్యాస్‌ను వదులుకొని మార్కెట్ రేటుకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి రెండు విధాలుగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా పథకాన్ని ప్రవేశపెట్టారు.