దేశవ్యాప్త ప్రయాణానికి ఒకే కార్డు

  0
  5

  దేశం నలుమూలలా, ఏ ప్రయాణంలోనైనా ఉపయోగ పడే కార్డును ప్రధాని మోదీ అహ్మదా బాద్‌లో ఆవిష్కరించారు.

  దేశవ్యాప్తంగా ఏ ప్రజారవాణా వ్యవస్థలో నైనా పౌరులు ప్రయాణించేందుకు ఈ కార్డు వీలు కల్పించనుంది.

  ఈ కార్డు పూర్తిగా దేశీయ టెక్నాలజీతో తయారుచెయ్యబడినది.

  ఈ కార్డు సాధారణ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుని పోలి ఉన్నటుంది.

  ఈ కార్డును ప్రయాణ టిక్కెట్ల కోసమే కాకుండా పార్కింగ్ మరియు టోల్ ప్లాజా వద్ద కూడా ఉపయోగించుకోవచ్చు.

  ఈ కార్డుని షాపింగ్ అవసరాలకు సైతము ఉపయోగించుకోవచు.

  మెట్రో స్మార్ట్‌ కార్డ్‌ తరహాలో దీనితో టికెట్‌ పొందవచ్చు. నగరాలైనా, పల్లెటూళ్లైనా భారత పౌరుల ప్రయాణం ఒకే కార్డుతో సాఫీగా సాగాలన్న ఆలోచనతోనే ఈ కార్డు రూపుదిద్దుకుందని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ తెలిపారు.