దేశవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు తగ్గుముఖం

  0
  9

  టీఎఫ్‌ఆర్ తగ్గుతుండడంతో మొత్తం జనాభాలో 0-19 ఏళ్ల వయసు మధ్య గల జనాభా తగ్గుతుంది. 2011లో ఈ గ్రూపులో ఉన్న జనాభా 41 శాతం ఉండగా.. 2041 నాటికి 25 శాతం పడిపోతుందని పేర్కొంది. అలాగే 60 ఏళ్ల పైబడిన జనాభా గ్రూపు పెరుగుతుందని వివరించింది.

  ⇒  2041 నాటికి 20-59 మధ్య ఉండే వర్కింగ్ గ్రూప్ జనాభా 59 శాతంగా ఉంటుంది.

  ⇒  దేశవ్యాప్తంగా జనాభా వృద్ధి రేటు గణనీయంగా తగ్గింది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఒడిశా, మహారాష్ట్ర, అసోం, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో వృద్ధి రేటు 1శాతం కంటే తక్కువగా ఉంది.

  ⇒  2031-41 నాటికి ఆంధ్రప్రదేశ్ జనాభా వృద్ధి రేటు సున్నాగా ఉంటుంది. తెలంగాణ సహా కర్ణాటక, కేరళ, హిమాచల్ ప్రదేశ్, బెంగాల్, పంజాబ్, మహారాష్ట్రల్లో ఈ వృద్ధి రేటు 0.1-0.2గా ఉంటుంది. ఇక తమిళనాడులో వృద్ధిరేటు 2031-41 నాటికి తిరోగమనదిశలో ఉంటుంది.

  ⇒  వార్షిక జనాభా వృద్ధిరేటు దేశవ్యాప్తంగా 2001-11 మధ్య 1.77 శాతం ఉండగా, 2011-2021 మధ్య 1.12 శాతం, 2021-31 మధ్య 0.72 శాతం, 2031-41 మధ్య 0.46 శాతం ఉంటుంది.

  ⇒  తెలంగాణలో వార్షిక జనాభా వృద్ధి రేటు 2011-2021 మధ్య 0.80 శాతం, 2021-31 మధ్య 0.53 శాతం, 2031-41 మధ్య 0.22 శాతం ఉంటుంది.

  ⇒  ఆంధప్రదేశ్‌లో ఈ వార్షిక జనాభా వృద్ధి రేటు 2001-11 మధ్య 1.10 శాతం ఉండగా, 2031-41 మధ్య 0.02 శాతంగా ఉంటుంది.

  ⇒  మొత్తం సంతానోత్పత్తి రేటు (టోటల్ ఫర్టిలిటీ రేటు-టీఎఫ్‌ఆర్) తెలంగాణలో 2001 నాటికి 2.3శాతంగా ఉండగా.. 2011కు 1.8శాతానికి, 2017కు 1.6 శాతానికి పడిపోరుుంది. 2041 వరకు 1.6 శాతంగా ఉంటుంది.

  ⇒  ఏపీలో 2001 నాటికి టీఎఫ్‌ఆర్ 2.3 శాతంగా ఉండగా.. 2041కి 1.5 శాతంగా ఉంటుందని పేర్కొంది.

  ⇒  సేవలరంగంలో వృద్ధి చూపించడంలో తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా అగ్రగామిగా నిలిచింది.

  ⇒  2015-16లో ఆంధ్రప్రదేశ్‌లో లింగ నిష్పత్తి 873 నుంచి 901 మధ్య ఉండగా.. 2018-19 నాటికి 930-980 నమోదైంది. తెలంగాణలో కూడా లింగ నిష్పత్తిలో సానుకూల మార్పు కనిపించింది.