దిల్లీలో జాతీయ జల అవార్డుల ప్రదానోత్సవం

  0
  10

  జాతీయ జల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం దిల్లీలో ఘనంగా జరిగింది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అవార్డులను అందజేశారు.

  ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, జిల్లాలు, సంస్థలు, మీడియా సంస్థలను అవార్డులకు ఎంపిక చేశారు.

  *ఉత్తమ రాష్ట్రం విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానం సంపాదించుకుంది. భూగర్భ జలాల పెంపుదలలో అనంతపురం జిల్లాకు ప్రథమ బహుమతి లభించింది. ప్రోత్సాహక జిల్లాల విభాగంలో కడప జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. భూగర్భజలాల పెంపుదలలో ప్రోత్సాహక జిల్లాల విభాగంలో విశాఖకు రెండో స్థానం.. నదీ పునరుజ్జీవం విభాగంలో కర్నూలు జిల్లాకు తొలిస్థానం లభించింది.

  *ఆంధ్రప్రదేశ్‌ తరఫున మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు ఇతర అధికారులు అవార్డులు అందుకున్నారు.

  *భూగర్భజలాల పెంపుదలలో తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకు ద్వితీయ బహుమతి లభించింది.

  *నీటి నిర్వహణ, యాజమాన్య విధానంలో ఉత్తమ టీవీ ప్రదర్శనల విభాగంలో ఈటీవీ తెలంగాణకు ద్వితీయ బహుమతి లభించింది.

  *నీటి వినియోగంలో కాకతీయ వర్సిటీ జియాలజీ విభాగం తొలిస్థానంలో నిలిచింది.