తొలి లోక్‌పాల్‌ చైర్మన్ గా పీసీ ఘోష్‌

  0
  5

  అవినీతి వ్యతిరేక అంబుడ్స్‌మన్‌ వ్యవస్థగా పిలుస్తున్న లోక్‌పాల్‌ తొలి చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌(66) పేరును కేంద్రం ఖరారు చేసింది.

  ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ March 17 న ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సిఫార్సు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

  ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జున ఖర్గే, న్యాయ కోవిదుడు ముకుల్‌ రోహత్గీ సభ్యులుగా ఉన్నారు.

  జనలోక్‌పాల్ కోసం అన్నా హజారే సుదీర్ఘ ఉద్యమం చేసిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి సహా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులపై వచ్చే అవినీతి ఆరోపణలపై విచారణ జరపడమే లోక్‌పాల్ ప్రధాన విధి.

  1952 మే 28న కోల్‌కతాలో జన్మించిన జస్టిస్ ఘోష్ 2017 మే 27న సుప్రీంకోర్టు జడ్జిగా పదవీ విరమణ పొందారు. అదే ఏడాది జూన్ 29 నుంచి జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఘోష్ తండ్రి దివంగత జస్టిస్ శంభూ చంద్ర ఘోష్ కలకత్తా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.