తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్

    0
    12

    తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్. కర్ణాటక హైకోర్టు నుంచి బదిలీ.

    కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు బదిలీ అయ్యారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో ఈ బదిలీకి సంబంధించి కేంద్ర న్యాయ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి హైకోర్టులో నవంబర్‌ 22లోగా బాధ్యతలు స్వీకరించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాజస్థాన్‌కు చెందిన జస్టిస్‌ రాఘవేంద్ర ఎస్‌ చౌహాన్‌.. 1959 డిసెంబర్‌ 24న జన్మించారు. 1980లో అమెరికాలోని ఆర్కాడియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1983లో దిల్లీ వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1983 నవంబరులో రాజస్థాన్‌ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. రాజస్థాన్‌ హైకోర్టులో 1986 నుంచి జూన్‌ 2005 వరకు న్యాయవాదిగా క్రిమినల్‌, రాజ్యాంగ, సర్వీసు చట్టాల్లో ప్రాక్టీసు చేశారు. 2005 జూన్‌ 13న అక్కడే శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. కర్ణాటక హైకోర్టు జడ్జిగా 2015 మార్చి 10న ప్రమాణ స్వీకారం చేశారు.