తెలంగాణ రచయిత్రి సుజాత గిడ్లాకు ‘శక్తి భట్‌’ పురస్కారం

  0
  12

  అమెరికాలో స్థిరపడిన తెలుగు దళిత మహిళా రచయిత సుజాత గిడ్లాకు 2018 సం॥నికి ‘శక్తి భట్‌ మొదటి పుస్తకం’ పురస్కారం లభించింది.

  • ఆమె రచించిన ‘యాంట్స్‌ అమాంగ్‌ ఎలిఫెంట్స్‌ : యాన్‌అన్‌టచబుల్‌ ఫ్యామిలీ అండ్‌ మేకింగ్‌ ఆఫ్‌ మోడర్న్‌ ఇండియా’ అనే పుస్తకానికి ఈ అవార్డు ప్రకటించారు. ఈ అవార్డుకు షార్ట్‌లిస్ట్‌ అయిన 6 పుస్తకాల్లో జడ్జీ ప్యానెల్‌ సుజాత పుస్తకాన్ని ఎంపిక చేసింది.
  • పేద జీవితం, పితృస్వామ్య వ్యవస్థ, తిరుగుబాటు, కమ్యూనిజం తదితర సామాజిక అంశాల గురించి సుజాత ఈ పుస్తకంలో వివరించారు. యువ రచయిత శక్తి స్మారకార్థం శక్తి భట్‌ ఫౌండేషన్‌ 2008లో నెలకొల్పిన ఈ పురస్కారం కింద రూ.2 లక్షలు ఇస్తారు.
  • సుజాత గిడ్లా తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని కాజీపేట మండలంలో పెరిగారు. ఇక్కడ కెనడియన్‌ మిషనరీలు తన చదువుకు సాయం చేయడంతో గిడ్లా క్రైస్తవంలోకి మారారు.
  • ఆమె తల్లి మేరి మంజు, తండ్రి లూథర్‌ ప్రభాకర్‌రావు. హైస్కూల్‌ అనంతరం వరంగల్‌ ప్రాంతీయ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఆమె ఫిజిక్స్‌లో మాస్టర్స్‌ ప్రోగ్రాం చేశారు. కోర్సులో ఆమె రెండోఏడాదిలో ఉండగా బడుగు వర్గానికి చెందిన విద్యార్థులను అగ్రకులానికి చెందిన ప్రొఫెసర్‌ ఒకరు కావాలనే ఫెయిల్‌ చేస్తున్నారన్న కారణంతో నిర్వహించిన సమ్మెలో గిడ్లా కూడా పాల్గొన్నారు.
  • సమ్మెలో పాల్గొన్న ఏకైక విద్యార్థిని ఆమెనే. నిరసనకారులందరినీ గుర్తుతెలియని ప్రాంతంలోని జైలుకు తరలించారు. ఆమె 3 నెలలు జైలు జీవితం గడిపారు. అప్పుడే ఆమెకు క్షయవ్యాధి సోకింది.
  • పౌర హక్కుల న్యాయవాది సాయంతో విడుదలయ్యారు. అనంతరం మద్రాస్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో అప్లైడ్‌ ఫిజిక్స్‌లో పరిశోధకురాలిగా పనిచేశారు. 1990లో తన 26వ ఏట కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లి స్థిరపడ్డారు