తెలంగాణ కరెంట్ అఫైర్స్

  0
  9

  * తెలంగాణలో కొత్తగా 4 మండలాలు
  * గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కోలాటం
  * ఐటా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్ విజేత నిధి చిలుముల

  తెలంగాణలో కొత్తగా 4 మండలాలు

  తెలంగాణలో కొత్తగా 4 మండలాలు ఏర్పాటయ్యాయి. మండలాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా వీటిని ఏర్పాటు చేశారు. దాంతో సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేట, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి, నిజామాబాద్‌ జిల్లాలోని వర్ని మండలాన్ని పునర్‌వ్యవస్థీకరించి మోస్రా, చండూరు మండలాలను ఏర్పాటు చేశారు.

  గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కోలాటం

  తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మార్చి 8న నిర్వహించిన సామూహిక మహిళా కోలాట ప్రదర్శనకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించింది.

  అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని గోదావరిఖని సింగరేణి జీఎం కార్యాలయ గ్రౌండ్‌లో 714 మందితో ఈ సామూహిక కోలాటం నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డు సర్టిఫికెట్, మెడల్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు చీఫ్ కోఆర్డినేటర్ రంగజ్యోతి అందజేశారు.

  ఐటా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్ విజేత నిధి చిలుముల

  ఐటా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి నిధి చిలుముల టైటిల్‌ గెలిచింది. పుణెలో జరిగిన ఈ టోర్నీలో ఏడో సీడ్‌ నిధి మహిళల సింగిల్స్‌ ఫైనల్లో 6-4, 6-0తో నాలుగో సీడ్‌ సోహా సాదిక్‌ (కర్ణాటక)ను వరుస సెట్లలో ఓడించింది. మహిళల డబుల్స్‌లో శ్రావ్య చిలకలపుడి టైటిల్‌ సాధించింది. ఫైనల్లో శ్రావ్య-వైదేహి 4-6, 6-1, 10-5తో హ్యుమేరా షేక్‌-సారా యాదవ్‌లను ఓడించారు.