తెలంగాణ ఏసీజేగా జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌

    0
    5

    హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ నియమితులయ్యారు.

    # హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ నియమితులయ్యారు. ఆయన్ను ఏసీజేగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చారు.

    # ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్‌ను కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేసినారు.

    # దీంతో హైకోర్టులో నంబర్‌ 2 స్థానంలో ఉన్న జస్టిస్‌ చౌహాన్‌ ఏసీజేగా నియమితులయ్యారు.

    # రాజస్థాన్ చెందిన జస్టిస్‌ చౌహాన్‌ గత ఏడాది నవంబర్‌ 21న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్‌ చౌహాన్‌ 1959 డిసెంబర్‌ 24న జన్మించారు.

    # 1980లో అమెరికాలోని ఆర్కాడియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.

    # 1983లో ఢిల్లీ వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 2005లో రాజస్తాన్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

    # 2015లో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు .