తెలంగాణలో సైబర్ రక్షక్ పథకం ప్రారంభం

  0
  7

  డిజిటల్‌ ఉపకరణాల మాటున జరుగుతున్న అనర్థాల పట్ల మహిళల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘సైబర్‌ రక్షక్‌’ పథకాన్ని ప్రారంభించారు డీజీపీ మహేందర్‌రెడ్డి.

  రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన విద్యార్థులకు సైబర్‌ అనర్థాలు అరికట్టడంలో శిక్షణ ఇచ్చి అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు.

  *మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ‘షి’ టీంల ఆధ్వర్యంలో తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) సహకారంతో ఎండ్‌ నౌ ఫౌండేషన్‌ రూపకల్పన చేసిన సైబర్‌ రక్షక్‌ పథకాన్నిమర్చి 18న డీజీపీ కార్యాలయంలో ప్రారంభించారు.

  *అమాయకులు సైబర్‌ నేరాలకు బలవ్వకముందే యువతను రక్షించాలన్నదే ఎండ్‌ నౌ సంస్థ ఉద్దేశమని ఆ సంస్థ ధర్మకర్త, హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య తెలిపారు.

  *ఎంపిక చేసిన విద్యార్థులకు సైబర్‌ నేరాల నియంత్రణ, సురక్షితంగా అంతర్జాలం వాడకం, సెల్‌ఫోన్ల వంటి వాటికి బానిసలుగా మారిన వారిని తిరిగి మామూలుగా మార్చడం వంటి వాటిపై శిక్షణ ఇస్తారు. వీరినే ‘సైబర్‌ రక్షక్‌’లు అంటారు.

  కార్యక్రమంలో శాంతిభద్రతల అదనపు డీజీ జితేందర్‌, ఎండ్‌నౌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు అనిల్‌ రాచమల్లు, డిజిటల్‌ మీడియా మినిస్ట్రీ ఆఫ్‌ ఐటీ సంచాలకులు దిలీప్‌, హెచ్‌.ఆర్‌.ఎండ్‌.ఎ., టాస్క్‌ సంస్థల డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ సీఎస్‌ శ్రీరాములు, సీఐడీ ఎస్పీ సుమతి పాల్గొన్నారు.