తెలంగాణకు 18 స్కోచ్ పురస్కారాలు

  0
  21

  పౌర సేవలు, అభివృద్ధి, వినూత్న పథకాల అమలు వంటి అంశాల ప్రాతిపదికన అందించే స్కోచ్ పురస్కారాల్లో తెలంగాణకు 18, ఆంధ్రప్రదేశ్‌కు 9 లభించాయి.

  న్యూఢిల్లీలో డిసెంబర్ 22న జరిగిన స్కోచ్ 55వ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ పురస్కారాలను అందజేశారు. పారిశుధ్యం, మహిళా సాధికారత, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించినందుకు సిరిసిల్ల మున్సిపాలిటీకి 5, మెదక్‌కు 2, పీర్జాదిగూడకు 1, బోడుప్పల్‌కు 3, సూర్యాపేటకు 1, మెప్మాకు 6 అవార్డులు దక్కాయి.

  స్కోచ్ అవార్డులు:

   స్కొచ్ అవార్డులు భారతీయ సమాజంలో మానవ నైపుణ్యాన్ని మరియు మార్పులకు గుర్తుగా జరుపుకున్నాయి. ఈ సమావేశాలు సానుకూలమైన సాంఘిక-ఆర్ధిక మార్పులను దోహదపడే తత్వశాస్త్రంపై ఆధారపడినవి, ఇవి సామూహిక నాయకత్వ సామర్ధ్యాలను ప్రదర్శించడం ద్వారా సమాజంలో మరియు పాలనలో విపరీతమైన పరివర్తనాలకు దోహదపదిన వారికీ అందజేయబడతాయి. భారతదేశంలో స్వతంత్రంగా స్థాపించబడిన పౌర పురస్కారాలు. 2003 లో, వీటిని స్థాపించినప్పుడు, స్కొచ్ అవార్డులు పరిపాలన, ఫైనాన్స్, బ్యాంకింగ్, టెక్నాలజీ, కార్పోరేట్ పౌరసత్వం, ఆర్ధికశాస్త్రం మరియు అన్నీ అభివృద్ధి రంగాలలో ఉత్తమ పద్ధతులకు గుర్తింపు గా యీ అవార్డులు అందించబడతాయి .