తాజా వార్తలు

  0
  18

  కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 24
  2 . యునైటెడ్ నేషన్స్ డే – 24 అక్టోబర్
  3 . భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ & ఇరాన్ మధ్య మొదటి త్రైపాక్షిక సమావేశం టెహ్రాన్‌లో జరిగింది .
  4. ఫ్లెసిఐ ఇండియా స్పోర్ట్స్ పురస్కారాలు 2018
  5 . పౌ బయా ఏడవసారి కామెరూన్ అధ్యక్షుడిగా గెలిచారు.
  6. హిరోషిమా లో జపాన్-ఇండియా ఐటీ కారిడార్ కోసం NASSCOM హిరోషిమా తో భాగస్వామ్యం.

  యునైటెడ్ నేషన్స్ డే – 24 అక్టోబర్:

  ఐక్యరాజ్యసమితి (UN) డే 2018 ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంది. యునైటెడ్ నేషన్స్ డే 1948 నుండి అక్టోబర్ 24 న జరుపుకుంటారు. 1971 లో, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సభ్యులను ఈ రోజు ఒక ప్రజా సెలవుదినంగా పరిశీలించాలని సిఫారసు చేసింది. ఈ రోజు 1945 లో UN చార్టర్ యొక్క ప్రవేశం అమలులోకి వచ్చినరోజుగా ఈ  వార్షికోత్సవం గుర్తుకు తెస్తుంది. అధికారులు సంతకం చేసి   ఈ వ్యవస్థాపక పత్రాన్ని ఆమోదించడంతో, ఐక్యరాజ్యసమితి అధికారికంగా అమలులోకి వచ్చింది.

   

  టెహ్రాన్‌లో భారతదేశం, ఆఫ్గనిస్తాన్, ఇరాన్ మధ్య జరిగిన మొదటి త్రైపాక్షిక సమావేశం:

  ఇరాన్ లోని తెహ్రాన్ లో  చబహర్ ఒప్పందం యొక్క కోఆర్డినేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆఫ్గనిస్తాన్ మరియు ఇరాన్  ల మధ్య  మొదటి త్రైపాక్షిక సమావేశం జరిగింది. భారత ప్రతినిధి బృందంలో కార్యదర్శి (ఆర్థిక సంబంధాలు) టిఎస్ తిరుమూర్తి నాయకత్వం వహించారు. చబహర్ ఓడరేవు ద్వారా అంతర్జాతీయ రవాణా మరియు రవాణా కోసం త్రైపాక్షిక ఒప్పందం యొక్క పూర్తి కార్యాచరణకు సంబంధించిన మూడు వైపుల మధ్య వివరమైన చర్చలు జరిగాయి.

   

  FICCI ఇండియా స్పోర్ట్స్ అవార్డ్స్ 2018 లో అవార్డు పొందిన అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా :

  FICCI (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) ప్రకటించిన భారత స్పోర్ట్స్ అవార్డ్స్ 2018 ఉత్తమ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (NSF) విభాగానికి గాను అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా  అవార్డు ను గెలుచుకుంది . ఈ అవార్డును భారత క్రీడల పురస్కార కార్యక్రమంలో ఫెడరేషన్ హౌస్, న్యూ ఢిల్లీలో ప్రదానం చేస్తారు. అవార్డులకు జ్యూరీ జస్టిస్ (రిటైర్డ్) ముకుల్ ముద్గల్ అధ్యక్షత వహించారు. పంకజ్ సింగ్ FICCI క్రీడా విభాగం హెడ్ గా  ఉన్నారు.

   

  కామెరూన్ అధ్యక్షుడిగా పాల్ బయా ఏడవసారి  పదవిని గెలుచుకున్నారు:

  పాల్ బియా, కామెరూన్ అధ్యక్షుడిగాఏడవసారి పదవిని గెలుచుకున్నారు. 1982 నుండి పాల్ బియ్యా కామెరూన్ ను  పాలించారు. అతని కి  85 సంవత్సరాలు. అతను అధ్యక్ష ఎన్నికలో 71.3% బ్యాలెట్ ఓట్లు  గెలుచుకున్నాడు. అతని ప్రత్యర్థి మారిస్ కమ్టో 14.2% తో రెండవ స్థానంలో నిలిచారు.

   

  హిరోషిమాలో జపాన్-ఇండియా ఐటీ కారిడార్ కోసం నాస్కామ్ హిరోషిమాతో భాగస్వామ్యం:

  భారతీయ IT పరిశ్రమల అత్యున్నత సంస్థ నాస్కామ్ హిరోషిమాలో జపాన్-ఇండియా ఐటీ కారిడార్‌తో సహకారం కోసం హిరోషిమా ప్రభుత్వము తో  ఒక భాగస్వామ్యంలోకి వచ్చింది. భారతదేశం నుండి జపాన్ వరకు వ్యాపార సహకారం మరియు ప్రతిభను బదిలీ చేయడమే దీని లక్ష్యం. ఈ భాగస్వామ్యం ద్వారా, జపాన్ IT మరియు సాఫ్ట్ వెర్  పరిశ్రమలు  సంఖ్య పెరుగుతుంది.