తాజా వార్తలు

  0
  16

  హిందూ వార్తాపత్రిక యొక్క సంపాదకుడిగా సురేష్ నంబం.
  ఆస్తానా , కజఖస్తాన్ లో షాంఘై సహకార సంస్థ (SCO) యొక్క సభ్య రాష్ట్రాల విద్యా మంత్రుల యొక్క 7 వ సమావేశం.
  ఫాలీ ఎస్ నారిమన్ కు లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ ఎక్స్ లెన్స్ అవార్డు.
  కిలిమంజారో ని అధిరోహించిన డాక్టర్ మధుసూదన్ రెడ్డి .
  అసోమ్, మేఘాలయల మధ్య ప్రయాణదూరం, కాలాన్ని తగ్గించడానికి బ్రహ్మపుత్ర నదిపై భారీ వంతెన .

  *ది హిందూ పబ్లిషింగ్ గ్రూపు డైరెక్టర్ల బోర్డు మూకుమ్మడి  గా సురేష్ నంబం ను హిందూ వార్తాపత్రిక యొక్క సంపాదకుడిగా నియమించారు. వార్తాపత్రిక పూర్వపు  సంపాదకుడు అయిన ముకుంద్ పద్మనాభన్ స్థానాన్ని ఇతడు భర్తీ  చేస్తాడు.

   

  *షాంఘై సహకార సంస్థ (SCO) యొక్క సభ్య రాష్ట్రాల విద్యా మంత్రుల యొక్క 7 వ సమావేశం ఆస్తానా , కజఖస్తాన్ లో  జరిగింది. మానవ వనరుల అభివృద్ధి రాష్ట్ర మంత్రి డాక్టర్ సత్య పాల్ సింగ్, భారత ప్రభుత్వ తరఫున పాల్గొన్నారు. కజఖస్తాన్ యొక్క విద్య మరియు సైన్స్ శాఖ మంత్రి ఎర్లన్ సాగదీవ్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

   

  *న్యాయకోవిదుడు, సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్ నారిమన్ కు లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ ఎక్స్ లెన్స్ అవార్డు-2018 లభించింది. ఈ మేరకు ఢిల్లీలో అక్టోబర్ 22న జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ… లాల్ బహదూర్ శాస్త్రి ఒక గొప్ప నాయకుడు అని చెప్పారు

   

  *ఆఫ్రికా ఖండంలో ఎత్తై శిఖరం కిలిమంజారో ని మహబూబ్ నగర్ లోని సుశ్రుత ప్రజావైద్యశాల ఎండీ డాక్టర్ మధుసూదన్ రెడ్డి అక్టోబర్ 22న అధిరోహించారు.
  మహబూబ్ నగర్ ట్రెక్కింగ్ క్లబ్ తరఫున ‘మహబూబ్ నగర్ బాలికలను రక్షించాలి’ అనే నినాదంతో ఆయన కిలిమంజారో ని అధిరోహించారు.

   

  *అసోమ్, మేఘాలయల మధ్య ప్రయాణదూరం, కాలాన్ని తగ్గించడానికి బ్రహ్మపుత్ర నదిపై నాలుగు వరుసల రహదారి వంతెనను నిర్మించనున్నారు. మేఘాలయలోని ఫుల్బరి, అసోంలోని దుబ్రీలను అనుసంధానం చేసే ఈ వంతెన పూర్తి అయితే మనదేశంలోనే అతిపొడవైన వంతెనగా చరిత్రపుటలకెక్కనుంది. ప్రస్తుతం ఈ రెండు పట్టణాల మధ్య ప్రయాణించాలంటే నర్‌నారాయణ్‌ వంతెన మీదుగా వాహనాలు 203 కిమీ ప్రయాణించాల్సి వస్తోంది. లేదంటే చిన్నచిన్న పడవలే దిక్కు.నదిపై 19.3 కిమీ పొడవునా వంతెన నిర్మిస్తే రెండున్నర గంటలు పడుతున్న ప్రయాణకాలం 15-20 నిముషాలకు తగ్గిపోనుంది. ఇది పూర్తి అయితే పశ్చిమబెంగాల్‌ నుంచి అసోంకూ రాకపోకలు సులువవుతాయి. ఈ ఆర్థికసంవత్సరంలోనే టెండర్లు పూర్తి చేసి, 2026-27నాటికి ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్మాణబాధ్యతలు చేపట్టిన జాతీయ రహదారులు, పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌హెచ్ఐడీసీఎల్‌) భావిస్తోంది.