ఢిల్లీలో సిగ్నేచర్ బ్రిడ్జి ప్రారంభం

  0
  17

  ఢిల్లీలో యమునా నదిపై నిర్మించిన సిగ్నేచర్ బ్రిడ్జిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నవంబర్ 4న ప్రారంభించారు.

  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ వంతెన ఉత్తర, ఈశాన్య ఢిల్లీల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. దీంతోపాటు వజీరాబాద్ పాతవంతెనపై రద్దీ కూడా గణనీయంగా తగ్గనుంది. కేబుళ్లతో వేలాడే ఈ వంతెన పొడవు 675 మీటర్లు. సిగ్నేచర్ బ్రిడ్జికి ఉన్న ప్రత్యేకతల కారణంగా పర్యాటక ప్రాంతంగా మారనుంది. ఎలివేటర్ల ద్వారా వంతెనపై 154 మీటర్ల ఎత్తైన ప్రాంతం నుంచి ఢిల్లీ నగరాన్ని చూడవచ్చు. మొట్టమొదటిసారిగా 1997లో అప్పటి ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రతిపాదించగా 2007లో ఢిల్లీ మంత్రివర్గం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
  *వంతెన విశేషాలు
  దీన్ని భారత్‌లోనే మొదటి అసమాన కేబుల్ వంతెనగా చెబుతున్నారు. దీని కోసం దాదాపు రూ. 1500 కోట్లు ఖర్చు చేశారు.

  154 మీటర్ల (505 అడుగులు) ఎత్తున్న ఈ వంతెన శిఖరం మీదకు వెళ్లి చుట్టూ దిల్లీ నగరం అందాలను వీక్షించే వెసులుబాటు కూడా ఉంటుంది. అందుకోసం ఆ శిఖరం మీద అద్దాల గది ఏర్పాటు చేశారు. ఆ గదిలో ఒకేసారి 50 మంది వరకూ ఉండొచ్చు.

  అంత ఎత్తుకు వెళ్లేందుకు లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ లిఫ్టులను మరో రెండు నెలల్లో ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

  సందర్శకుల కోసం ఈ వంతెన వద్ద సెల్ఫీ పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు.