జూన్ 13 కరెంట్ అఫైర్స్ 2019

  0
  7

  # ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిగా కె.విజయానంద్‌
  # కోల్‌కతాలో విద్యాసాగర్ విగ్రహం ఆవిష్కరణ
  # తాత్కాలిక సీవీసీగా శరద్ కుమార్

  ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిగా కె.విజయానంద్‌

  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కావేటి విజయానంద్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జూన్ 13 ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ఈసీఐ స్పష్టం చేసింది. విజయానంద్‌ ప్రస్తుతం ఏపీ జెన్‌కో సీఎండీ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఆయన 1992లో ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ సబ్‌ కలెక్టర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.

  కోల్‌కతాలో విద్యాసాగర్ విగ్రహం ఆవిష్కరణ

  కోల్‌కతాలోని విద్యాసాగర్ కళాశాల వద్ద పంతొమ్మిదవ శతాబ్దపు ప్రముఖ సంఘ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ నూతన ప్రతిమను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జూన్ 11న ఆవిష్కరించారు. విద్యాసాగర్ పాత ప్రతిమను 2019, మేలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రోడ్ షో సందర్భంగా కొందరు ధ్వంసం చేశారు. కాగా అదే కళాశాల భవనం ఎదుట 8.5 అడుగుల ఎత్తు కలిగిన విద్యాసాగర్ తెల్లని ఫైబర్ గ్లాస్ విగ్రహాన్నీ మమత ఆవిష్కరించారు.

  తాత్కాలిక సీవీసీగా శరద్ కుమార్

  తాత్కాలిక కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా శరద్ కుమార్‌ను నియమిస్తూ జూన్ 11న కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు సీవీసీగా ఉన్న కె.వి.చౌదరి పదవీ కాలం జూన్ 9న ముగిసింది. దీంతో విజిలెన్స్ కమిషనర్ (వీసీ) శరద్ కుమార్‌ను ప్రభుత్వం తాత్కాలిక సీవీసీగా నియమించింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) మాజీ అధిపతి అయిన శరద్ కుమార్ 2018, జూన్ 12న విజిలెన్స్ కమిషనర్‌గా నియమితులయ్యారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్‌లో మరో కమిషనర్ అయిన టి.ఎం.భాసిన్ పదవీ కాలం జూన్ 10న ముగిసింది.