జీశాట్-11 ప్రయోగం విజయవంతం

    0
    12

    సమాచార ఉపగ్రహం జీశాట్-11ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది.

    దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్-5 రాకెట్ ద్వారా డిసెంబర్ 4న ఈ ప్రయోగాన్ని చేపట్టారు. 5,854 కిలోల పరిమాణంలో ఉన్న జీశాట్-11 ఇస్రో ఇప్పటివరకు ప్రయోగించిన ఉపగ్రహాల అన్నింటికంటే బరువైంది. ఈ ఉపగ్రహం 15 ఏళ్లపాటు సేవలు అందించనుంది.

    డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా దేశమంతటా సెకనుకు 100 జీబీ డేటా అందించేందుకు నాలుగు జీశాట్-11 ప్రయోగాలకు ప్రణాళిక రూపొందించగా.. తాజా ప్రయోగం మూడోది. ‘బిగ్ బర్డ్’గా పిలుచుకునే జీశాట్-11 తయారీకి ఇస్రో రూ.600 కోట్లు వెచ్చించింది.