జీఎస్టీ వసూళ్లలో దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం

    0
    6

    జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. బెంచ్ మార్క్ దాటి 4 శాతం అదనంగా వసూళ్లు అయ్యాయి.

    వాణిజ్య పన్నుల వసూళ్లలో ఏపీ 14.98 శాతం వృద్ధి సాధించింది. అదేవిధంగా జీఎస్టీ పరిధిలో పన్ను వసూళ్లు 18.10 శాతం వృద్ధి, 21087 కోట్ల వసూళ్లు. పెట్రో ఉత్పత్తుల విక్రయాల్లో 10 .68 శాతం జీఎస్టీ వృద్ధి, 10,829.85 కోట్ల వసూళ్లు.

    మద్యం విక్రయాల్లో 13.82 శాతం జీఎస్టీ వృద్ధి, 10,915.7 కోట్ల పన్ను వసూళ్లు. వృత్తి పన్ను వసూళ్లలో 3.5 శాతం జీఎస్టీ వృద్ధి , 221.28 కోట్ల వసూళ్లు సాధించింది.

    2017-18లో 37,444.95 కోట్లు 2018-19లో 5,608 కోట్ల పెరుగుదలతో 43,053 కోట్లు.. 2017-18లో 53 వేల కోట్ల వార్షిక పన్ను వసూళ్లు, 18-19లో 60 వేల కోట్ల పన్నులు వసూళ్లయ్యాయి.

    చిన్నవ్యాపారులంతా సంవిధాన పథకంలోకి…

    చిన్నవ్యాపారులంతా సంవిధాన పథకంలోకి వచ్చేలా జీఎస్‌టీ రెండు మార్పులు చేసింది.

    మొదటిది:
    ఈ పథకం కింద ప్రస్తుతం రూ.కోటి వార్షిక టర్నోవర్‌ ఉన్న చిన్న వ్యాపారులు 1 శాతం జీఎస్‌టీ చెల్లిస్తే సరిపోతుంది. ఈ టర్నోవర్‌ను రూ.1.5 కోట్లకు పెంచింది. పన్ను శాతంలో మార్పు చేయలేదు. వస్తువుల తయారీదార్లు, సరఫరాదార్లకు ఇది ఉపకరిస్తుంది. రూ.40 లక్షల వరకు మినహాయింపును ఉపయోగించుకోవడంతో పాటు, ఆ పైన ఉన్న టర్నోవర్‌కు 1 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది.

    రెండోది:
    రూ.50 లక్షల వార్షిక టర్నోవర్‌ ఉన్న వస్తు, సేవల సర్వీసు ప్రొవైడర్లు, సరఫరాదారులు సంవిధాన విధానాన్ని ఎంచుకొని 6%పన్ను చెల్లిస్తే సరిపోతుంది. సేవల రంగంలో ఉన్నవారికి లుబ్ధి కలుగుతుంది.