జి సతీష్ రెడ్డికి 2019కి గాను మిస్సెల్ సిస్టం అవార్డు

  0
  12

  డి ఆర్ డి ఓ (DRDO) చైర్మన్ జి సతీష్ రెడ్డికి 2019కి గాను మిస్సెల్ సిస్టం అవార్డు 2019ను అమెరికన్ ఇన్స్టిట్యూట్ అఫ్ Aeronautics మరియు Astronautics నుండి అందుకుంన్నారు.

  ఎస్ క్రిస్టఫర్ పదవీ విరమణ చేసిన అనంతరం డీఆర్డీవో చైర్మన్ పదవిలో సతీశ్‌రెడ్డి నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామం వాసి సతీశ్‌రెడ్డి హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రులయ్యారు.

  ఆయన 1985లో డీఆర్‌డీఓలో చేరారు. అంతరిక్ష పరిజ్ఞానంలో నిష్ణాతుడైన సతీశ్‌రెడ్డి క్షిపణి వ్యవస్థలపై పరిశోధన, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అంతరిక్ష పరిజ్ఞానం, పరిశ్రమల అభివృద్ధికి చేయూతనందించారు. నిశ్చల సెన్సర్లు, నావిగేషన్ పథకాలు, అల్గారిథం వ్యవస్థలు, అమరిక పద్ధతులు, సెన్సర్ మోడళ్లను రూపొందించి, అభివృద్ధి చేసిన బృందాలకు సతీశ్‌రెడ్డి నేతృత్వం వహించారు. ఉపగ్రహ నావిగేషన్ రిసీవర్లు, హైబ్రిడ్ నావిగేషన్ వ్యవస్థల అభివృద్ధిలో కూడా పాలుపంచుకున్నారు. ఆయన నాయకత్వంలోనే అధునాతన పరికరాలు, వివిధ రకాల ఏవియానిక్స్ వ్యవస్థలు రూపుదిద్దుకొని ప్రయోగాలలో సైతం విజయవంతమయ్యాయి.

  లండన్‌లోని రాయల్ ఏరోనాటికల్ సొసైటీలో ఫెలో ఆఫ్ రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నావిగేషన్‌గా ఆయన అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. రష్యాలోని ఎకాడమీ ఆఫ్ నావిగేషన్, మోషన్ కంట్రోల్ సంస్థలో శాశ్వతకాల విదేశీ సభ్యునిగా మరో అరుదైన గౌరవం పొందారు. భారత్‌లోని అనేక ఇంజినీరింగ్ సంస్థలలో సైతం గౌరవసభ్యునిగా ఉన్న సతీశ్‌రెడ్డి ప్రతిష్ఠాత్మక హోమీ బాబా స్మారక అవార్డును సొంతం చేసుకున్నారు.

  స్వావలంబన పరిశోధనకు ప్రధాని నుంచి అవార్డుతోపాటు పలు సత్కారాలను అందుకున్నారు. బ్రిటన్‌కు చెందిన రాయల్ ఏరోనాటికల్ సొసైటీ నుంచి రజత పతకం అందుకున్న తొలి భారతీయ రక్షణ విభాగం శాస్త్రవేత్త కూడా సతీశ్‌రెడ్డినే.