జలశక్తి అభియాన్‌

  0
  54

  దేశంలో నానాటికీ తరిగిపోతున్న జల వనరులను సంరక్షించుకొని, వాన నీటిని ఒడిసి పట్టుకొనేలా ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు జలశక్తి అభియాన్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమాన్ని చేపట్టింది.

  గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నీటి పొదుపు, సంరక్షణ, పునర్వినియోగాలను ప్రోత్సహించే దిశగా కార్యాచరణను ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని నీటికి ఇబ్బందిపడుతున్న 256 జిల్లాలు, 1592 బ్లాకుల్లో రెండు దశల్లో నిర్వహించదలచిన ప్రచార ఉద్యమాన్ని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సోమవారం ప్రారంభించారు.

  కేంద్రం నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. తొలి దశ కార్యక్రమాలు నిర్వహించే రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. ఈ రాష్ట్రానికి చెందిన 24 జిల్లాలు, 137 బ్లాకులను ఇందుకు ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్‌ (9 జిల్లాలు, 64 బ్లాకులు), తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చెరి రెండో దశలోకి వస్తాయి. అన్ని వర్గాల ప్రజలను మమేకం చేయనున్నారు.

  భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నీటి సంరక్షణ చేపట్టాల్సిన కర్తవ్యం మనందరిపై ఉందని ఇరువురు పేర్కొన్నారు. కాగా అమితాబ్, ఆమీర్ ఖాన్ ట్వీట్లపై ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇరువురి నుంచి సలహాలు తీసుకుంటామని తెలిపారు.

  ఇదిలా ఉంటే ప్రధానంగా దేశంలోని తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో జల సంరక్షణ, నీటి పారుదల నిర్వహణ కార్యక్రమాలను చేపట్టేందుకు జల శక్తి అభియాన్ తోడ్పడనుంది. ఇప్పటికే దేశంలని 255 జిల్లాల్లోని 1092 బ్లాకుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమ పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు కేంద్ర, రాష్ట్రాలకు చెందిన సీనియర్‌ అధికారులను ఇన్‌ఛార్జిలుగా నియమించామన్నారు.