జపాన్ పర్యటనలో ప్రధాని మోదీ

    0
    7

    భారత్-జపాన్ 13వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 27న జపాన్ చేరుకున్నారు.

    పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని షింజో అబే తో బేటీ అయిన మోదీ అనధికారిక చర్చలు జరిపారు. రోబోల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఎఫ్ఏఎన్యూసీ పరిశ్రమను ఇరు దేశాధినేతలు సందర్శించారు. జపాన్లోని అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్ ఫుజి ఆవరించి ఉన్న తన విడిది గృహంలో అబే ప్రధాని మోదీకి అక్టోబర్ 28న విందు ఇచ్చారు. ఈ గౌరవం పొందిన తొలి విదేశీ నేత మోదీనే.
    జపాన్ రాజధాని టోక్యోలో అక్టోబర్ 29న జరిగిన భేటీలో ఆర్థిక, రక్షణ, ప్రాంతీయ భద్రత, ఉగ్రవాదం, జపాన్ ఆర్థిక సాయంతో నిర్మిస్తున్న ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు సహా పలు అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించారు. అలాగే వివిధ రంగాలకు సంబంధించిన ఆరు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. భారత్, జపాన్‌ల విదేశాంగ, రక్షణ మంత్రులతో కూడిన 2+2 చర్చలు జరపాలని మోదీ, అబే నిర్ణయించారు. అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత సభ్యత్వానికి జపాన్ మద్దతు తెలిపింది.