జన్యు ఎడిటింగ్ నిలిపివేస్తున్నట్లు చైనా శాస్త్రవేత్త ప్రకటన

  0
  11

  జన్యు ఎడిటింగ్ ద్వారా ప్రపంచంలోనే తొలిసారిగా శిశువులను సృష్టించిన తన ప్రయోగంపై విమర్శలు వ్యక్తం కావడంతో చైనా శాస్త్రవేత్త హె జియాంక్వే వెనక్కి తగ్గారు. వివాదాస్పదమైన ఈ కసరత్తును నిలుపుదలలో ఉంచినట్లు వెల్లడించారు.

  అయితే తన ప్రయోగాన్ని ఆయన సమర్థించుకున్నారు. 2018 నవంబర్ 28న హాంకాంగ్లో జరిగిన ఒక వైజ్ఞానిక సదస్సులో ఆయన మాట్లాడారు. భవిష్యత్లో హెచ్ఐవీ రాకుండా చూసేలా పిండాల్లో డీఎన్ఏను మార్చడం ద్వారా కవల ఆడ శిశువులను సృష్టించినట్లు జియాంక్వే పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.
  • ఇది శాస్త్రవేత్తల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీనివల్ల కలిగే ఉపద్రవాలు, నైతికవిలువలను వారు ప్రస్తావించారు.తోటి శాస్త్రవేత్తల పరిశీలన లేకుండానే తన ప్రయోగ ఫలితం ముందే లీకు కావడంపై జియాంక్వే క్షమాపణ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా క్లినికల్ ప్రయోగాన్ని నిలిపివేస్తున్నట్లు వివరించారు.
  • ఈ సదస్సులో జియాంక్వేపై ప్రశ్నల వర్షం కురిసింది. తన ప్రయోగం వల్ల కలిగే ముప్పుపై సదరు తల్లిదండ్రులకు ముందే తెలుసని ఆయన చెప్పారు. తాను పనిచేస్తున్న సదరన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఈ ప్రయోగం గురించి తెలియదన్నారు.