ఛత్తీస్‌గఢ్‌ సీఎంగా భూపేశ్‌ బఘేల్‌

  0
  16

  ఛత్తీస్‌గఢ్‌‌ ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ వీడింది. గత ఐదు రోజులుగా సుదీర్ఘ చర్చలు జరిపిన కాంగ్రెస్‌ అధిష్ఠానం.. చివరికి ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు భూపేశ్‌ బఘెల్‌ వైపు మొగ్గు చూపింది.

   ఈమేరకు కాంగ్రెస్‌ శాసన సభాపక్ష భేటీలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ భేటీ అనంతరం భూపేశ్‌ పేరును కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే మీడియాకు ప్రకటించారు. రాయ్‌పూర్‌లో రేపు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కుర్మి సమాజిక వర్గానికి చెందిన భూపేశ్‌.. మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్‌ సింగ్‌ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.

  ఛత్తీస్‌గఢ్‌ సీఎం రేసులో కాంగ్రెస్‌ నుంచి నలుగురు పోటీ పడ్డారు. భూపేశ్‌తో పాటు సింగ్‌దేవ్‌, చరణ్‌దాస్‌ మహంత్‌, తామ్రధ్వజ్‌ సాహు సీఎం రేసులో ఉన్నారు. ఈ నలుగురితో శుక్రవారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమావేశం అయ్యారు. అందరి అభిప్రాయాలను తీసుకున్న అనంతరం భూపేశ్‌ అభ్యర్థిత్వం వైపే కాంగ్రెస్‌ పెద్దలు మొగ్గు చూపారు.

  1961లో ఓ రైతు కుటుంబంలో జన్మించిన బఘేల్‌ 1986లో యూత్‌ కాంగ్రెస్‌లో చేరడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.