చైనా కొత్త తరం మానవరహిత యుద్ధవిమానం

    0
    11

    అమెరికాకు దీటుగా పోరాడాటానికి చైనా ఎంతో కృషి చేసి దీని ని అభివృద్ధి చేసింది.

    శత్రువుల రాడార్లకు చిక్కకుండా చక్కర్లు కొట్టే కొత్త తరం మానవరహిత యుద్ధవిమానాన్ని (యూసీఏవీ) చైనా తయారుచేసింది. ఇప్పటివరకూ ఆ దేశం అభివృద్ధి చేసిన డ్రోన్లలో అధునాతనమైనది ఇదే. దీనికి సీహెచ్7 అని పేరు పెట్టారు. చైనాలోని ఝూహైలో జరిగిన ఓ కార్యక్రమంలో దీన్ని ఆవిష్కరించారు. కొన్ని విషయాల్లో అమెరికా ఆర్క్యూ-170 యూసీఏవీ కన్నా ఇది చాలా మెరుగ్గా పనిచేస్తుందని, మరింత అధునాతనమైన ఆర్క్యూ-180కి దరిదాపుల్లో దీని సామర్థ్యాలున్నాయని సీహెచ్ శ్రేణి యూసీఏవీల రూపకర్త షి వెన్ తెలిపారు. సీహెచ్-7 తయారీ ద్వారా అత్యంత ఎత్తులో సుదీర్ఘంగా పనిచేసే మానవరహిత యుద్ధవిమానాలను ఉత్పత్తి చేసిన రెండో దేశంగా చైనా ఘనత సాధించింది. ఈ జాబితాలో అమెరికాది తొలి స్థానం. సీహెచ్-7 లోపల అస్త్రాలను ఉంచేందుకు అరలు ఉంటాయి. యాంటీ-రేడియేషన్, నౌకావిధ్వంసక క్షిపణులు, గగనతలం నుంచి భూతలంపైనున్న లక్ష్యాలను చేధించే క్షిపణులు, కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే బాంబుల వంటి వాటిని వీటిలో పెట్టొచ్చు. ఒకట్రెండేళ్లలో సీహెచ్-7కు గగనతల పరీక్షలు జరుపుతామని షి తెలిపారు. నిఘా, యుద్ధ సహకారం, క్షిపణుల ప్రయోగం వంటి వాటికి దీనిని వినియోగించుకోవచ్చని చెప్పారు. సీహెచ్-7 10 మీటర్ల పొడవు, రెక్కలతో సహా 22 మీటర్ల వెడల్పు ఉంటుంది. గరిష్ఠంగా 13వేల కిలోల బరువును మోసుకెళ్లే ఈ యూసీఏవీ 15 గంటలపాటు ఏకబిగిన గగన విహారం చేయగలదు.