గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఔట్‌లుక్‌ రిపోర్ట్

  0
  7

  అకాల మరణాల్లో 25 శాతం పర్యావరణ మార్పులు, కాలుష్యం వల్లే సంభవిస్తున్నాయి.

  రిపోర్టులోని ముఖ్యాంశాలు 

   విపరీతమైన కర్బన ఉద్గారాల విడుదల, రసాయనాల కారణంగా కలుషితమవుతున్న తాగునీరు, వాయు కాలుష్యంతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రభావితులవుతున్నారని ఐరాస తెలిపింది.

  ఈ మేరకు గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఔట్‌లుక్‌ (జీఈవో) నివేదికను ఐరాస విడుదల చేసింది. 70 దేశాలకు చెందిన 250 మంది శాస్త్రవేత్తలు ఆరేళ్లపాటు పర్యావరణ మార్పులపై పరిశోధన చేశారు.

  పేద, ధనిక దేశాల మధ్య అంతరం బాగా పెరుగుతోందని, అభివృద్ధి చెందిన దేశాల్లో ఆహార వృథా ఎక్కువగా ఉందని, కర్బన ఉద్గారాల విడుదల, అడవుల నరికివేత విపరీతంగా పెరుగుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు.

  ఈ పరిణామాలు పేద దేశాలపై ప్రభావం చూపుతున్నాయని, దీంతో పేద దేశాల్లో అకాల మరణాలు పెరుగుతున్నాయని విశ్లేషించారు.

  తాగునీరు అందక పేద దేశాల్లో ఏటా 14 లక్షల మంది చనిపోతున్నారని, దీంతోపాటు వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 6-7 లక్షల మంది మృత్యువాతపడుతున్నారని జీఈవో నివేదిక వెల్లడించింది.

  ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాల విడుదలలో 9 శాతం వాటా ఆహార వృథా వల్లనే సంభవిస్తోందని నివేదిక పేర్కొంది.