గ్రెటా థన్‌బర్గ్‌ నోబుల్ శాంతి బహుమతి‍కి నామినేట్‌

  0
  14

  గ్లోబల్ వార్మింగ్‌పై గ్రెటా థన్‌బర్గ్‌ చేస్తున్న కృషికిగాను నోబుల్ శాంతి బహుమతి‍కి నామినేట్‌ అయ్యెను.

   స్వీడిష్ వాతావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ (16 )ఇపుడు ప్రపంచ దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. గ్లోబల్ వార్మింగ్‌పై ఆమె చేస్తున్న కృషికిగాను నోబుల్ శాంతి బహుమతి‍కి నామినేట్‌ అయ్యారు. దీంతో వేలాదిమంది యువతకు ప్రేరణగా, గ్లోబల్‌ ఐకాన్‌గా నిలిచారు.

  మార్చి 15వ తేదీన 105 నగరాల్లో 1,659 పట్టణాలు, నగరాల్లో లక్షలాది మంది విద్యార్థులు భారీ ఎత్తున నిరసనలకు దిగిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది.

  గ్లోబ్‌ వార్మింగ్‌ను పట్టించుకోకపోతే ప్రపంచ యుద్ధాలకు దారి తీస్తుంది. వలసలకు, సంక్షోభాలకు ఆస్కారం ఇచ్చినట్లవుతుంది. ఇప్పుడే ఏదో ఒకటి చెయ్యకపోతే ముప్పు తప్పదన్న ఉద్దేశంతో గ్రెటా తంబర్గ్ చేసిన అలుపెరుగని పోరాటాన్ని మేం గుర్తించాం.

  ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది యువకులకు స్పూర్తినిస్తూ థన్‌బర్గ్‌ చేపట్టిన ప్రపంచ ఉద్యమం తమ్మల్ని ఆకట్టుకుంది.. అందుకే నోబుల్ పీస్ అవార్డుకి నామినేట్ చేశామని స్వీడన్‌ ప్రభుత్వ అధికారులు ప్రకటించారు.

  నోబెల్ బహుమతి 

   నోబెల్ బహుమతులు భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, వైద్యశాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు మరియు ప్రపంచ శాంతికికృషిచేసిన మహానుభావులకు ప్రతియేటా బహూకరిస్తుంటారు. ఈ ఐదు బహుమతులు ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895నాటి వీలునామా ప్రకారం 1901లో ప్రారంభించబడ్డాయి (నోబెల్ మరణించిన 5 సంవత్సరముల తరువాత).

  ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్దం శాంతి బహుమతి మటుకు 1969 నుండి బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ద్వారా ఇవ్వడము జరుగుతోంది. ఈ ఆరు బహుమతులు అత్యధిక పారితోషికంతో పాటు పేరు ప్రఖ్యాతలకు నిదర్శనం. ప్రతీ సంవత్సరం, ఒక్క శాంతి బహుమానం తప్ప మిగతా ఐదు బహుమతులు నోబెల్ గారి వర్ధంతి అయిన డిసెంబరు 10 నాడు, స్టాక్ హోంలో ఇవ్వబడతాయి. వివిధ రంగములలో విశేషమైన కృషి/పరిశోధనలు చేసిన, విప్లవాత్మక విధానాలు/పరికరాలతో శాస్త్రాన్ని ముందంజ వేయించిన, మానవ సమాజానికి ఆ శాస్త్రంతో అత్యంత సహాయాన్ని అందించిన వ్యక్తులకు, సంస్థలకు (శాంతి బహుమతి మాత్రమే) ఇవ్వబడుతుంది.