గృహాల నిర్మాణాలపై జీఎస్టీ తగ్గింపు

  0
  11

  నిర్మాణంలో ఉన్న నివాస గృహాలపై కేంద్రం జీఎస్టీని తగ్గించింది. దీంతో గృహ కొనుగోలుదారులకు జీఎస్టీ నుంచి స్వల్పవూరట కలిగినట్లయిందని కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.

  మధ్యతరగతి గృహ కొనుగోలుదారులకు దృష్టిలో ఉంచుకుని జీఎస్టీని తగ్గించినట్లు ఆయన పేర్కొన్నారు.
  నిర్మాణంలో ఉన్న నివాస గౄహాలపై ఇప్పటివరకు 12 శాతం ఉండేది. జీఎస్టీ కౌన్సిల్‌ దీన్ని 5%కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

  రూ.45లక్షల లోపు గృహాల కొనుగోలుపై జీఎస్టీ 1శాతంగా వర్తింపజేశారు. ఇంతకు ముందు ఇది 8%గా ఉండేది. దీంతోపాటు సరసమైన గృహాలకు జీఎస్టీ కౌన్సిల్‌ సరికొత్త నిర్వచనం ఇచ్చింది.

  మెట్రో నగరాల్లో 60చదరపుమీటర్లు లేదా అంతకంటే తక్కువ ప్రాంతంలో నిర్మించిన గృహాలను ఇక సరసమైన గృహాలుగా అభివర్ణిస్తారు.

  ఇక మెట్రో నగరాలు కాని నగరాల్లో 90చదరపు మీటర్లు లేదా అంతకంటే తక్కువ స్థలంలో గృహాలు నిర్మిస్తే అవి సరసమైన గృహాల కిందకు వస్తాయి.

  ఈ తగ్గించిన జీఎస్టీ రేట్లు ఏప్రిల్‌1 నుంచి అమల్లోకి వస్తాయని జైట్లీ తెలిపారు.