కోల్ కతా లో ఉమ్మితే రూ.లక్ష జరిమానా

    0
    11

    బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, చెత్తవేసినా రూ.లక్ష వరకు జరిమానా విధించేలా కోల్ కతా నగరపాలక సంస్థ చట్టాన్ని సవరించారు.

    • ఈ బిల్లుకు పశ్చిమబెంగాల్ శాసనసభ ఇటీవల ఆమోద ముద్ర వేసింది. కొత్తగా ప్రారంభించిన దక్షిణేశ్వర్ ఆకాశమార్గంపై అసహ్యకరమైన రీతిలో కిళ్లీ మరకలు కనిపించడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇలాంటి చర్యకు విధిస్తున్న జరిమానాను పెంచాలని శాసనసభ ప్రతిపాదించింది.
    • కనీస జరిమానాను రూ.50 నుంచి రూ.5000కి, గరిష్ఠ మొత్తాన్ని రూ.5000 నుంచి రూ.లక్షలకి పెంచారు. కోల్ కతా మేయర్ గా సోవన్ ఛటర్జీ స్థానంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిర్హద్ హకీం 2018 నవంబర్ 25న ఎన్నికయ్యారు