ప్రముఖ రచయిత, పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం-2018 లభించింది.
ఈ మేరకు కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబార్ డిసెంబర్ 5న ప్రకటించాడు. తెలుగు భాష నుంచి ఇనాక్ రచించిన ‘విమర్శిని’ వ్యాస రచనకు ఈ పురస్కారం లభించింది.
2018 సంవత్సరానికిగాను మొత్తం గుర్తింపు పొందిన 24 భాషల్లో ఉత్తమ రచన, కవితా సంపుటి, చిన్న కథల విభాగాల్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించింది. ఈ పురస్కారాలకు ఎంపికై న వాటిలో ఆరు నవలలు, ఆరు చిన్న కథలు, ఏడు కవిత్వం, మూడు సాహిత్య విమర్శలకు అవార్డులు దక్కాయి.
సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన నవలలు
భాష |
నవల |
రచయిత |
తెలుగు |
విమర్శిని |
ఆచార్య కొలకలూరి ఇనాక్ |
తమిళం |
సంచారం |
ఎస్.రామకృష్ణన్ |
సంస్కృతం |
మమా జనని |
రమాకాంత్ శుక్లా |
కన్నడ |
అనుస్త్రేని-యజమానికె |
కేజీ నాగరాజప్ప |
హిందీ |
పోస్ట్ బాక్స్ నం.203-నాళ సొపరా |
చిత్రా ముడ్గల్ |
ఉర్దూ |
రోహిణ్ |
రెహమాన్ అబ్బాస్ |
మరోవైపు ప్రాచీన, మధ్యయుగ సాహిత్య రంగంలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా పలువురికి భాషా సమ్మాన్ పురస్కారాల్ని ప్రకటించారు. దక్షిణ భారతం నుంచి కన్నడ రచయిత జి.వెంకటసుబ్బయ్యకు ఈ పురస్కారం లభించింది. ఇతర ప్రాంతాలనుంచి యోగేంద్రనాథ్ శర్మ, గగనేంద్రనాథ్ దాస్, శైలజకు ఈ అవార్డు దక్కింది. గుర్తింపు పొందని భాషల నుంచి ఐదుగురికి పురస్కారాలు లభించాయి. పురస్కారగ్రహీతలకు 2019, జనవరి 29న ఢిల్లీలోని అకాడమీలో జరిగే కార్యక్రమంలో అవార్డుతోపాటు లక్ష నగదు బహుమతి, కాంస్య జ్ఞాపిక ప్రదానం చేస్తారు.