కొత్త రూ.20 నోటు

  0
  9

  నమూనా నోటును విడుదల చేసిన ఆర్బీఐ (రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా)

  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా త్వరలో కొత్త రూ.20 నోట్లను విడుదల చేయనుంది. మహాత్మా గాంధీ సిరీస్‌లో ఈ నోట్లు ఆకుపచ్చ, పసుపు కలగలిసిన రంగులో ఉండనున్నట్లు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సంతకం ఉండే ఈ నోటు ముందు భాగంలో మహాత్మాగాంధీ బొమ్మ, పక్కనే దేవనాగరి లిపిలో రూ.20 అని రాసి ఉంటుంది. దీంతోపాటు అశోకుడి స్థూపం కూడా ఉంటుంది.

  ఇక నోటు వెనకభాగంగంలో ఎల్లోరా గుహల చిత్రంతోపాటు స్వచ్ఛ భారత్‌ లోగో, నినాదం ఉంటాయి. కొత్త నోట్లు వచ్చినప్పటికీ పాత రూ.20 నోట్లు చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది. కొత్త నోటుకు సంబంధించి నమూనాను ఆర్బీఐ విడుదల చేసింది. ఇప్పటికే రూ.10, రూ.100 విలువచేసే కొత్త నోట్లను ఆర్బీఐ విడుదల చేసిన విషయం తెలిసిందే.

  నోట్ల ర‌ద్దు త‌ర్వాత కొత్త‌గా రూ. 500, 2000 నోట్ల‌ను కేంద్రం ప్ర‌వేశ పెట్టిన సంగ‌తి తెలిసిందే. పాత 500, 1000 నోట్ల‌ను రద్దు చేసిన ప్ర‌భుత్వం రూ. 5, 10, 50, 100 నోట్ల‌ను మాత్రం మార్చ‌లేదు. అవి అలాగే చ‌లామ‌ణిలో ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్త రూ. 50 నోట్ల‌ను విడుదల చేసింది.

  అచ్చం కొత్త రూ. 500 నోటు లాగానే ఉండే ఈ నోటు వెన‌క భాగంలో మాత్రం దేశ సాంస్కృతిక వార‌స‌త్వం ఉట్టిప‌డేలా. హంపీ ర‌థాన్ని చేర్చింది. కొత్త రూ. 500 నోటు వెన‌క భాగంలో ఎర్ర కోట ఉంటే రూ. 50 నోటు పై హంపీ ర‌థాన్ని చేర్చి దేశ చారిత్ర‌క సంప‌ద‌ను దేశ ప్ర‌జ‌ల‌కు తెలిసేనా వినూత్నంగా ఆలోచించింది ఆర్బీఐ. మ‌హాత్మా గాంధీ కొత్త చిత్రంతో పాటు అప్పటి  ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ డా. ఆర్. ఉర్జిత్ ప‌టేల్ సంత‌కంతో ఈ నోట్లు వచ్చాయి.