కేసీఆర్ కు బిజినెస్ రిఫార్మర్ పురస్కారం

  0
  11

  తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ‘ఎకనమిక్ టైమ్స్-బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం లభించింది.

  ఈ మేరకు ముంబైలో నవంబర్ 17న జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అందజేసిన ఈ అవార్డును కేసీఆర్ తరపున ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… కొత్త పరిశ్రమలకు 15 రోజుల్లో సింగిల్ విండో విధానంలో అనుమతుల జారీ వంటి విప్లవాత్మకమైన సంస్కరణలను సీఎం ప్రవేశపెట్టారన్నారు.

  కల్వకుంట్ల చంద్రశేఖర రావు (జ: 17 ఫిబ్రవరి, 1954) భారతదేశంలోని నూతనంగా యేర్పడిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. ఈయన కె.సి.ఆర్ గా సుపరిచితులు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడైన చంద్రశేఖరరావు 15వ లోక్ సభ లో ఆంధ్రప్రదేశ్ లోని కరీంనగర్ లోకసభ నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహించాడు. 2004 నుండి 2006 వరకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. 15వ లోక్సభలో మహబూబ్నగర్ నియోజకవర్గం నుండి విజయం సాధించాడు.
  ఇతడు మొదట తెలుగుదేశం పార్టీలో సభ్యుడు. తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం సాధన ధ్యేయంగా ఆ పార్టీ నుండి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించాడు. 2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెసుతో కలిసి పోటీచేసి 5 లోక్సభ స్థానాలను దక్కించుకున్నాడు. అయితే తరువాతి కాలంలో యు.పి.ఏ నుండి వైదొలగాడు. ఇతడు ఎం.ఏ (సాహిత్యం) ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పూర్తిచేశాడు.