కేఎంపీ ఎక్స్ప్రెస్ వే ప్రారంభం

    0
    2

    హరియాణాలోని గుర్గ్రామ్ జిల్లాలో 83 కిలోమీటర్ల కుండ్లి-మనేసర్-పల్వాల్ (కేఎంపీ) ఎక్స్ప్రెస్ వే ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 19న ప్రారంభించారు.

    అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 3.2 కిలోమీటర్ల వల్లభ్గఢ్-ముజేసర్ మెట్రో రైల్ లింక్ ప్రారంభోత్సవం, పల్వాల్ జిల్లాలో శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. మొత్తం 135 కిలోమీటర్ల పొడవైన కేఎంపీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.6,400 కోట్లు వెచ్చించింది. దీనిలోని 52 కిలోమీటర్ల రహదారి 2016లోనే అందుబాటులోకి వచ్చింది.

    జాతీయ రాజధాని ప్రాంతంలోని కేఎంపీ ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి రావడంతో ఢిల్లీకి వాహనాల రాకపోకల రద్దీ గణనీయంగా తగ్గడంతోపాటు రాజధాని ప్రాంతంలో కాలుష్యం కూడా తగ్గుముఖం పట్టనుంది.
    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. అడ్డంకులు సృష్టించడం ద్వారా ప్రాజెక్టులను జాప్యం చేసి ప్రజలను మోసగించిందని విమర్శించారు. సోమవారం ఆయన హరియాణా రాష్ట్రం గుర్‌గ్రామ్‌ జిల్లాలోని 83 కిలోమీటర్ల కుండ్లి–మనేసర్‌–పల్వాల్‌ (కేఎంపీ) ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రారంభించారు. అనంతరం సుల్తాన్‌పూర్‌లో జరిగిన సభలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 3.2 కిలోమీటర్ల వల్లభ్‌గఢ్‌– ముజేసర్‌ మెట్రో రైల్‌ లింక్‌ ప్రారంభోత్సవం, పల్వాల్‌ జిల్లాలో శ్రీ విశ్వకర్మ స్కిల్‌ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు.

    ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..‘హర్యానా ప్రజలకు ఇది చాలా ముఖ్యమైన రోజు. చేపట్టిన పనిని దృఢ సంకల్పంతో పూర్తి చేయడమనే మా ప్రభుత్వ వైఖరితోపాటు గత పాలకులు ఇదే పనిని అసంపూర్తిగా వదిలేసిన తీరును మనం ఇక్కడ గమనించాలి. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 9 ఏళ్ల క్రితమే ఢిల్లీలో కామన్వెల్త్‌ క్రీడల సమయంలోనే పూర్తి కావాల్సి ఉంది. కానీ, అలా జరగలేదు. 12 ఏళ్లు పట్టింది. అంచనా వ్యయం రూ.1,200 కోట్ల నుంచి భారీగా పెరిగిపోయింది. కామన్‌వెల్త్‌ క్రీడల నిర్వహణలో (సీడబ్ల్యూజీ కుంభకోణం) జరిగిందే, ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణంలోనూ చోటుచేసుకుంది.

    135 కిలోమీటర్ల పొడవైన కేఎంపీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.6,400 కోట్లు వెచ్చించింది. దీనిలోని 52 కిలోమీటర్ల రహదారి 2016లోనే అందుబాటు లోకి వచ్చింది. వల్లభ్‌గఢ్‌– ముజేసర్‌ మెట్రో రైల్‌ లింక్‌ నిర్మాణానికి రూ.580 కోట్లు ఖర్చు కాగా, శ్రీ విశ్వకర్మ స్కిల్‌ యూనివర్సిటీ నిర్మాణానికి రూ.989 కోట్లు కేటాయించారు.