కేంద్ర మంత్రివర్గంలో స్వల్ప మార్పులు

    0
    13

    కేంద్ర మంత్రి వర్గంలో మంగళవారం సాయంత్రం స్వల్ప మార్పులు చోటుచేసుకొన్నాయి.

    కేంద్ర మంత్రి అనంతకుమార్ సోమవారం కన్నుమూయడంతో ఆయన నిర్వహించే రెండు శాఖలను మరో ఇద్దరు మంత్రులకు అదనంగా కేటాయించారు. కేంద్ర మంత్రి సదానందగౌడకు అదనంగా ఎరువులు, రసాయనాలశాఖను అప్పగించారు. మరో మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు పార్లమెంటరీ వ్యవహారాలశాఖను కేటాయించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి వర్గం అనంతకుమార్ మృతిపట్ల నేడు సంతాపం తెలిపింది.
    ఊపిరితిత్తుల క్యాన్సర్తో కన్నుమూసిన కేంద్రమంత్రి అనంత్కుమార్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాల మధ్య మంగళవారం పూర్తయ్యాయి. కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, నిర్మలా సీతారామన్, రాజ్నాథ్ సింగ్, పియూష్ గోయల్, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా , భాజపా అగ్రనేత ఎల్కే అడ్వాణీ, కర్ణాటక భాజపా నేతలు అంత్యక్రియలకు హాజరై ఆయనకు తుది వీడ్కోలు పలికారు.